- Advertisement -
కైరో: ఈజిప్టులోని మిన్యా ప్రావిన్సులో మంగళవారం ఆగి ఉన్న ట్రక్కును ప్రయాణికులతో వెళుతున్న బస్సు ఢీకొన్న ప్రమాదంలో 22 మంది మరణించగా మరో 33 మంది గాయపడ్డారు. దేశ రాజధాని కైరోను మిన్యాకు అనుసంధానం చేసే హైవేపై మంగళవారం తెల్లవారుజామున ఈ ప్రమాదం సంభవించినట్లు మిన్యాలోని స్థానిక అధికారులు తెలిపారు. రోడ్డు వారగా నిలిపి ట్రక్కు టైరు మారుస్తుండగా వెనుక నుంచి వేగంగా వచ్చిన బస్సు ఢీకొన్నట్లు అధికారులు చెప్పారు. కైరోకు 220 కిలోమీటర్ల దూరంలోని మలవి నగరం వద్ద ఈ ప్రమాదం జరిగింది. హైవేపై ప్రమాదం జరగడంతో భారీగా ట్రాఫిక్ జామ్ జరిగింది. పెద్ద సంఖ్యలో ఆంబులెన్సులు ప్రమాదం స్థలికి చేరుకుని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించాయి. బస్సు ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జు కావడంతోపాటు ట్రక్కు వెనుక భాగంలోకి దూసుకువెళ్లిన వీడియో దృశ్యాలను అధికారులు మీడియాకు అందచేశారు.
- Advertisement -