Saturday, November 16, 2024

ప్రపంచ సంపన్నుల్లో అదానీకి నాలుగో స్థానం

- Advertisement -
- Advertisement -

Gautam Adani secures world's fourth richest rank on Forbes list

ఆయన నికర విలువ 114 బిలియన్ డాలర్లు
బిల్‌గేట్స్‌ను వెనక్కినెట్టిన అదానీ
10వ స్థానంలో ముకేశ్ అంబానీ
మొదటి స్థానంలో ఎలాన్ మస్క్

న్యూఢిల్లీ : ప్రపంచంలో అత్యంత సంపన్నుల జాబితాలో అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ నాలుగో స్థానంలో నిలిచారు. సంవత్సర కాలంలోనే ఆయన నికర విలువ రెట్టింపు అయింది. మంగళవారం ఫోర్బ్ రియల్ టైమ్ బిలియనీర్స్ జాబితాను విడుదల చేసింది. జాబితా ప్రకారం, మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్‌ను వెనక్కి నెట్టి అదానీ నాలుగో స్థానానికి చేరుకున్నారు. బిల్ గేట్స్ తన సంపద నుండి 20 బిలియన్ డాలర్లను విరాళంగా ఇస్తానని ప్రకటించారు. ఈ కారణంగా బిల్‌గేట్స్ 102 బిలియన్ డాలర్ల సంపదతో సంపన్నుల జాబితాలో ఒక స్థానం తగ్గి ఐదో స్థానానికి చేరుకున్నారు. ఇక గౌతమ్ అదానీ 114 బిలియన్ డాలర్ల సంపదతో నాలుగో స్థానానికి ఎగబాకారు. ఫోర్బ్ సంపన్నుల జాబితా ప్రకారం, భారతదేశం నుంచి గౌతమ్ అదానీ నాలుగో స్థానంలో ఉన్నారు. అయితే ఆయన కంటే ముందు మొదటి మూడు స్థానాల్లో నంబర్ వన్ స్థానంలో టెస్లా ఎలోన్ మస్క్ ఉండగా, ఆయన నికర విలువ 230 బిలియన్ డాలర్లుగా ఉంది. ఇక రెండో స్థానంలో లూయిస్ విట్టన్‌కు చెందిన బెర్నార్డ్ ఔర్నాల్ట్, మూడో స్థానంలో అమెజాన్ జెఫ్ బెజోస్ ఉన్నారు.

అంబానీ సంపద 88 బిలియన్ డాలర్లు

ప్రపంచ వ్యాప్తంగా భారతదేశం నుంచి అందరి కంటే ముందు ఉండే రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీ అదానీతో పోలిస్తే దిగువకు పడిపోయారు. ఈసారి జాబితాలో అంబానీ 10వ స్థానంలో ఉన్నారు. ఆయన నికర విలువ 88 బిలియన్ డాలర్లు ఉంది. మొదటి నలుగురు ధనవంతులలో గౌతమ్ అదానీ అత్యధికంగా 2.3 బిలియన్ డాలర్ల సంపదను పెంచుకున్నారు. అంబానీ సంపద 1.5 బిలియన్ డాలర్లు పెరిగింది. ఇటీవల ప్రభుత్వం పెట్రోలియం కంపెనీలపై విండ్ ఫాల్ ట్యాక్స్ విధిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కారణంగా రిలయన్స్ ఇండస్ట్రీస్ స్టాక్ భారీగా పడిపోయింది. దీంతో ముకేశ్ అంబానీ సంపద తగ్గుముఖం పట్టింది. అదే సమయంలో అదానీ గ్రూప్ కంపెనీలలో స్థిరమైన వృద్ధి ఉంది, ఈ ఏడాది కూడా ఆయన నికర విలువ వేగంగా పెరిగింది. దీని కారణంగా గౌతమ్ అదానీ ప్రపంచ సంపన్నుల వరుసలో నాలుగో స్థానానికి చేరుకున్నారు. జూన్‌లో అదానీ సమాజ సేవ కోసం 7.7 బిలియన్ డాలర్లు విరాళంగా ప్రకటించారు.

126వ స్థానంలో సావిత్రి జిందాల్

ఫోర్బ్ జాబితాలో చోటు దక్కించుకున్న భారత్‌కు చెందిన సంపన్న మహిళ సావిత్రి జిందాల్ నికర విలువ గత రెండేళ్లలో మూడు రెట్లు పెరిగింది. 2020లో ఆమె సంపద 4.8 బిలియన్ డాలర్లు ఉండగా, 2022 నాటికి అది 18 బిలియన్ డాలర్లకు పెరిగింది. ఫోర్బ్ ప్రకారం, సావిత్రి జిందాల్ గత కొన్ని దశాబ్దాలుగా భారతదేశంలో అత్యంత సంపన్న మహిళగా ఉన్నారు. ప్రపంచ సంపన్నుల జాబితాలో సావిత్రి జిందాల్ 126వ స్థానానికి ఎగబాకారు. 2020లో ఆమె 349 స్థానంలో ఉన్నారు. ఆ తర్వాత బయోకాన్‌కి చెందిన కిరణ్ మజ్ముదర్ షా, కృష్ణ గోద్రేజ్ ఉన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News