Thursday, December 19, 2024

ఈడీ కస్టడీలో మాజీ పోలీస్ కమిషనర్ సంజయ్ పాండే

- Advertisement -
- Advertisement -

ముంబై: నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ ఫోన్ ట్యాపింగ్ కేసులో ముంబై నగర మాజీ పోలీస్ కమిషనర్ సంజయ్ పాండేను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మంగళవారం అరెస్ట్ చేసింది. మనీలాండరింగ్ కేసులో నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ ఉద్యోగుల ఫోన్లను చట్ట విరుద్దంగా సంజయ్‌పాండే ట్యాప్ చేశారని ఈడీ అభియోగం. 1986 బ్యాచ్‌కు చెందిన రిటైర్డ్ మాజీ ఐపీఎస్ అధికారిని ఏడు గంటలకు పైగా విచారించిన తరువాత ఈడీ ఆయనను అరెస్టు చేసినట్టు ప్రకటించింది. అంతకు ముందు సోమవారం కూడా సంజయ్‌పాండేను ఈడీ అధికారులు ప్రశ్నించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News