Monday, December 23, 2024

దేశంలో రెండే కులాలు: కెటిఆర్

- Advertisement -
- Advertisement -

Two castes in Public

హైదరాబాద్: ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా తెలంగాణ విధానాలు ఉన్నాయని మంత్రి కెటిఆర్ తెలిపారు. సైఫాబాద్‌లో బిజినెస్ ఫెసిలిటేషన్ సెంటర్‌ను మంత్రి కెటిఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. దేశంలో రెండే కులాలు ఉన్నాయని, ఒకరు డబ్బున్నవారు, రెండోది పేదవారు అని చెప్పారు. పారిశ్రామికవేత్తలకు అన్ని రకాల వసతులు కల్పిస్తున్నామని, గతంలో దళిత జ్యోతి అనే కార్యక్రమం కెసిఆర్ ప్రారంభించారని గుర్తు చేశారు.

ఉమ్మడి రాష్ట్రంలో కరెంట్ ఇవ్వాలని పారిశ్రామికవేత్తలు ధర్నా చేశారన్నారు. టిఎస్‌ఐపాస్ ద్వారా 15 రోజుల్లో అనుమతి ఇస్తున్నామన్నారు. పేదరిక నిర్మూలనకు సిఎం కెసిఆర్ కృషి చేస్తున్నారని, దానిలో భాగంగా దళితబంధు పథకం తీసుకొచ్చామన్నారు. చిల్లర మాటలు మాట్లాడే వారు ఎప్పుడు ఉంటారని మండిపడ్డారు. నాణ్యమైన విద్య ఉపాధి అవకాశాలపై దృష్టి పెడుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఎల్‌ఎ క్రాంతి కిరణ్, ఐటి ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్, టిఎస్‌పిఎస్‌సి చైర్మన్ బాలబల్లు,

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News