Monday, December 23, 2024

ప‌వ‌న్ క‌ల్యాణ్‌కు వైర‌ల్ ఫీవ‌ర్‌… ఆందోళనలో ఫ్యాన్స్

- Advertisement -
- Advertisement -

Pawan Kalyan is sick due to viral fever

హైదరాబాద్: జనసేన పార్టీ అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అస్వస్థకు గురయ్యారు. రాజకీయ నేపథ్యంలో ప్రజలకు న్యాయం చేయాలని ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో పవన్ పర్యటించారు. ఈ క్రమంలో ఆయన అస్వస్థతకు గురయ్యారు. ఆయనకు వైరల్ ఫీవర్ వచ్చినట్లుగా సమాచారం. వైరల్ ఫీవర్ రావడంతో ఈ నెల 24న జరగాల్సిన జనవాణి కార్యక్రమం వాయిదా పడింది. ఈ కార్యక్రమం తిరిగి ఈ నెల 31న నిర్వహించనున్నట్లు పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. అయితే వైరల్ ఫీవర్ లో ఇబ్బంది పడుతున్న పవన్ ప్రస్తుతం హైదరాబాద్ విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో తన సినిమాల షూటింగ్లలకు బ్రేక్ ఇచ్చారు. ఈ విషయం నెట్టింట వైరల్ కావడంతో ఆయన త్వరగా కోలుకోవాలని అభిమానులు ప్రార్థనలు చేస్తున్నారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని తమ అభిమాన హీరోకు సూచిస్తున్నారు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News