న్యూఢిల్లీ : ఆల్ట్ న్యూస్ సహ వ్యవస్థాపకుడు మహ్మద్ జుబైర్‌కు సుప్రీం కోర్టు ఊరట కల్పించింది. ప్రస్తుతం ఆయనపై నమోదైన అన్ని కేసుల్లో ఎఫ్‌ఐఆర్‌లపై మధ్యంతర బెయిల్‌ను మంజూరు చేసింది. అలాగే భవిష్యత్‌లో నమోదయ్యే కేసుల్లోనూ అరెస్టు చేయకుండా కోర్టు ఊరట కల్పించింది. ఉత్తరప్రదేశ్‌లో నమోదైన అన్ని ఎఫ్‌ఐఆర్‌లను ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్‌కు జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ డీవై చంద్ర చూడ్, జస్టిస్ ఎన్‌ఏ బోపన్న ధర్మాసనం బదిలీ చేసింది. జుబైర్ ట్వీట్లపై దర్యాప్తు చేసేందుకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్‌ను కోర్టు రద్దు చేసింది. ఈ వ్యవహారానికి సంబంధించి జుబైర్‌పై ప్రస్తుతం నమోదైన కేసులతోపాటు భవిష్యత్‌లో నమోదయ్యే ఎఫ్‌ఐఆర్‌లు సైతం ఢిల్లీకి బదిలీ అవుతాయని స్పష్టం చేసింది. కోర్టు ఎఫ్‌ఐఆర్‌లను రద్దు చేయనప్పటికీ తనపై ఉన్న అన్ని కేసులను రద్దు చేయాలని కోరుతూ ఢిల్లీ కోర్టును ఆశ్రయించేందుకు జుబైర్‌కు అవకాశం కల్పించింది. ఎట్టకేలకు కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో జుబైర్ జైలు నుంచి విడుదల కానున్నారు.
జర్నలిస్ట్ జుబైర్‌కు మధ్యంతర బెయిల్
- Advertisement -
- Advertisement -
- Advertisement -