పతకాలు సాధించిన క్రీడాకారులకు మంత్రి అభినందనలు
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశాల మేరకు రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు చేపట్టామని క్రీడా, పర్యాటక శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ అన్నారు. క్రీడా పాఠశాలలో ఆధునిక మౌలిక సదుపాయాలు కల్పించామన్నారు. తెలంగాణకు చెందిన క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయ, ఓలంపిక్స్ లలో మెడల్స్ సాధించాలని మంత్రి ఆకాక్షించారు. క్రీడాకారులు అత్యుత్తమ స్థాయిలో రాణించి రాష్ట్రానికి, దేశానికి పేరు తేవాలని కోరారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ హైదరాబాద్‌లోని తన క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర క్రీడా పాఠశాలకు చెందిన క్రీడాకారులను అభినందించారు. శ్రీనగర్‌లో జూన్ 22 నుండి 26 వరకు డాల్ లేక్ సరస్సులో జరిగిన 23వ జాతీయ సబ్ జూనియర్ ఛాంపియన్ షిప్ 2022 లో అండర్ 13 బాలుర డబుల్ స్కల్ విభాగంలో రజత పతకాలను సాధించిన ఎన్ అశ్వత్థామ గౌడ్, జె. రాకేష్ , అండర్ 15 బాలికల ఫోర్స్ విభాగంలో రజక పతకాలను సాధించిన మహాలక్ష్మి, భావనలను , అండర్ 15 బాలికల ఫోర్స్ విభాగంలో రజత పతకాలను సాధించిన శైలజ, శ్రావ్య, సాయి ప్రసన్న లను మాజి మంత్రి జడ్చర్ల శాసనసభ్యులు డా. లకా్ష్మరెడ్డితో కలిసి మంత్రి ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో స్పోర్ట్ స్కూల్ ఓఎస్‌డి డా. హరికృష్ణ, స్పోర్ట్ ఆఫీసర్ బోస్, కోచ్‌లు ఇస్మాయిల్, సతీష్, మాజి జెడ్‌పిటిసి వెంకట్ గౌడ్ తదితరలు పాల్గొన్నారు.