Monday, December 23, 2024

‘గుంతలకడి గురునాధం’గా వెన్నెల కిషోర్

- Advertisement -
- Advertisement -

Vennela Kishore first look release from Macherla Niyojakavargam

యంగ్ అండ్ వెర్సటైల్ హీరో నితిన్ కథానాయకుడిగా నటిస్తున్న  మాస్, కమర్షియల్ ఎంటర్‌టైనర్‌ ‘మాచర్ల నియోజకవర్గం’ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. పొలిటికల్ ఎలిమెంట్స్‌తో మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని శ్రేష్ట్ మూవీస్ బ్యానర్‌పై సుధాకర్ రెడ్డి, నికితారెడ్డి నిర్మిస్తున్నారు.  రాజ్‌కుమార్ ఆకెళ్ల సమర్పిస్తున్నారు. ఇంట్రస్టింగ్ ప్రమోషనల్ కంటెంట్ తో క్యూరియాసిటీని పెంచుతున్న యూనిట్ తాజాగా ఈ చిత్రం నుండి వెన్నెల కిషోర్ పాత్రని పరిచయం చేస్తూ ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేసింది. ఈ చిత్రంలో ‘గుంతలకడి గురునాధం’ అనే పాత్రలో కనిపించబోతున్నారు వెన్నెల కిషోర్. షార్ట్ కట్ లో గురు అనే పేరు కూడా వుంది. అంతేకాదు ఆయన పాత్రకు ‘ఇగో కా బాప్’ అనే క్యాప్షన్ ఇవ్వడం మరింత ఆసక్తికరంగా వుంది. ‘ఇగో కా బాప్’ క్యాప్షన్ కి తగ్గట్టుగానే ఫస్ట్ లుక్ లో వెన్నెల కిషోర్ చాలా సీరియస్ గా చూస్తూ ఇచ్చిన ఇగోయిస్టిక్ ఎక్స్ ప్రెషన్ ఆయన పాత్రపై ఆసక్తిని పెంచింది.

ఈ చిత్రంలో కృతిశెట్టి, కేథరిన్ థ్రెసా కథానాయికలుగా నటిస్తుండగా, అంజలి స్పెషల్ నంబర్ ‘రారా రెడ్డి’లో సందడి చేస్తోంది. ఇటివలే విడుదలైన లిరికల్ వీడియోకు అద్భుతమైన స్పందన వచ్చింది. ఎంఎస్ రాజశేఖర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో నితిన్, సిద్ధార్థ్ రెడ్డి అనే ఐఏఎస్ అధికారిగా కనిపించనున్నారు. సముద్రఖని మెయిన్ విలన్‌గా నటిస్తున్నారు. ఈ చిత్రానికి ప్రసాద్ మూరెళ్ల సినిమాటోగ్రాఫర్ పని చేస్తుండగా, మహతి స్వర సాగర్ సంగీతం సమకూరుస్తున్నారు. ఈ చిత్రానికి మామిడాల తిరుపతి డైలాగ్స్ అందించగా, సాహి సురేష్ ఆర్ట్ డైరెక్టర్ గా, కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటర్‌ గా పనిచేస్తున్నారు. ‘మాచర్ల నియోజకవర్గం’ ఆగస్ట్ 12న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్ గా విడుదల కానుంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News