Saturday, November 16, 2024

యువతలో నైపుణ్యాలను మెరుగుపరిచేందుకు టాస్క్‌తో మెట్రో ఒప్పందం

- Advertisement -
- Advertisement -

Metro contract with Task

మన తెలంగాణ, హైదరాబాద్ : ప్రభుత్వ, పరిశ్రమ, విద్యాసంస్దలలో నైపుణ్యాలను మెరుగుపరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాలకు ప్రచారం కల్పించడంలో భాగంగా ఎల్‌అండ్‌టీ మెట్రో రైల్, తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్, డిపార్ట్‌మెంట్ ఆప్ ఐటీఈసీ ఓ అవగాహన ఒప్పందం చేసుకున్నాయి. సాంకేతికంగా అర్హతలు కలిగిన, తెలంగాణ రాష్ట్రం నుంచి అర్హతలు కలిగిన అభ్యర్థులకు ఉపాధి అవకాశాలను మెరుగుపరుచడంతో పాటుగా వారికి అవసరమైన శిక్షణను సైతం అందించనున్నారు. టాస్క్, ఎల్‌అండ్‌టీఎంఆర్‌హెచ్‌ఎల్‌కు ప్రాతినిథ్యం వహిస్తూ టాస్క్ సీఈఓ శ్రీకాంత్ సిన్హా, ఎల్ అండ్‌టీ ఎండీ కెవీబీరెడ్డి ఈ అవగాహన ఒప్పంద పత్రాలను రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ నగరాభివృద్ది శాఖ మాత్యులు కె.టి.రామారావు, ఐటీ ముఖ్యకార్యదర్శి, టాస్క్‌వైస్ చైర్మన్ జయేష్‌రంజన్ ఇతర ప్రభుత్వ ఉన్నతాధికారులతో మెట్రో రైల్, కియోలిస్ హైదరాబాద్ సమక్షంలో మార్చుకున్నారు. టాస్క్ కార్పొరేట్ ఎంఓయు ఎక్సేంజ్, కాలేజ్ మేనేజ్‌మెంట్ మీట్‌లో జరిగింది.

ఈఎంఓయులో భాగంగా టాస్క్ తమ విస్తృతస్దాయి డాటాబేస్‌లో ఉన్న అభ్యర్థులకు నైపుణ్యాభివృద్దికి తోడ్పటంతోపాటుగా ఎల్ అండ్ టి ఎంఆర్‌హెచ్‌ఎల్‌కు, దాని ఓఎం భాగస్వామి కియోలిస్ హైదరాబాద్ మాస్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ ప్రైవేటు లిమిటెడ్‌కు ప్రతిభావంతులతో కూడిన బృందాన్ని సిద్దం చేయనుంది. ఈసందర్భంగా హెచ్‌ఎంఆర్‌ఎల్ ఎండీ ఎన్‌వీఎస్‌రెడ్డి మాట్లాడుతూ ఉపాధి అవకాశాలను సృష్టించడం కోసం రాష్ట్రంలో యువతకు అదనపు నైపుణ్యాలను అందించడం కోసం తెలంగాణ ప్రభుత్వం ఎల్లప్పుడు కృషి చేస్తూనే ఉంటుంది. టాస్క్‌తో ఎల్‌అండ్‌టీ ఎంఆర్‌హెచ్‌ఎల్ ఈఒప్పందం హెచ్‌ఎంఆర్ ప్రయాణంలో అత్యంత కీలకమైన మైలురాయిని నిలుస్తుంది. యువత సామర్దం మెరుగుపరచడంలో పరిశ్రమ అగ్రగామిగా వెలుగొందుతున్న హెచ్‌ఎంఆర్ వారి కెరీర్‌ను మరింతగా వృద్ది చేసే రోడ్‌మ్యాప్‌ను రూపొందించడంతో పాటుగా తెలంగాణలో ఉపాధి అవకాశాలను సైతం మెరుగుపరుచనుందని తెలిపారు.

అనంతరం ఎల్‌అండ్‌టీ ఎండీ కెవీబీ రెడ్డి ప్రసంగిస్తూ ఎంఓయు ద్వారా మాతో టాస్క్ చేతులు కలిపినందుకు నైపుణ్యాభివృద్ది రాష్ట్రంలో ఉపాధి కల్పన, సరైన ప్రతిభను సొంతం చేసుకోవడం పరంగా ఇది రెండు సంస్దలకు పరస్పర ప్రయోజనం కలిగించనుంది. అత్యంత వేగంగా వృద్ది చెందుతున్న మెట్రోరైల్ రంగంతోపాటు హెచ్‌ఎంఆర్‌లో కెరీర్ అన్వేషించే వారికి అత్యత్తమ అవకాశాలను సైతం అందిస్తుందని వెల్లడించారు. ఈసందర్భంగా టాస్క్ సీఈవో శ్రీకాంత్ సిన్హా వివరిస్తూ ఈఫస్ట్ డేఫస్ట్ హవర్ స్కిల్లింగ్ మోడల్‌ను అమలు చేసేందుకు ఎల్‌అండ్‌టీ ఎంఆర్‌హెచ్‌ఎల్‌తో భాగస్వామ్యం చేసుకోవడం సంతోషంగా ఉందని, యువత సాంకేతిక సామర్ధంలను మరింతగా మెరుగుపరచుకోవడంలో ఇది సహాయపడుతుందన్నారు. తెలంగాణ యువత ప్రయోజనాల దృష్టా తాము తీసుకువచ్చిన ప్రతిపాదనను అంగీకరించిన మెట్రో రైల్, కియోలిస్ మేనేజ్‌మెంట్‌కు ధన్యవాదాలు తెలిపారు. ఎల్‌అండ్‌టీ హెచ్‌ఎల్, కియోలిస్ హైదరాబాద్ సాధారణ శిక్షణ, రిక్రూట్‌మెంట్ ప్రక్రియను అదనంగా ఈఎంఓయు పనిచేయనుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News