Sunday, November 17, 2024

బుమ్రా చేజారిన టాప్ ర్యాంక్..

- Advertisement -
- Advertisement -

బుమ్రా చేజారిన టాప్ ర్యాంక్
మూడో స్థానానికి డుసెన్, బాబర్, బౌల్ట్‌లకు అగ్రస్థానం
ఐసిసి వన్డే ర్యాంకింగ్స్
లండన్: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) బుధవారం తాజాగా ప్రకటించిన వన్డే ప్లేయర్ ర్యాంకింగ్స్‌లో పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్ బ్యాటింగ్ విభాగంలో టాప్ ర్యాంక్‌ను నిలబెట్టుకున్నాడు. ఇక బౌలింగ్‌లో న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్ అగ్రస్థానానికి ఎగబాకాడు. మరోవైపు టీమిండియా స్టార్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా టాప్ ర్యాంక్‌ను చేజార్చుకున్నాడు. తాజా ర్యాంకింగ్స్‌లో బుమ్రా రెండో స్థానంలో నిలిచాడు. ఇక బ్యాటింగ్‌లో సౌతాఫ్రికా స్టార్ బ్యాటర్ రసి వండర్ డుసెన్ మూడో ర్యాంక్‌కు చేరుకున్నాడు. ఇంగ్లండ్‌తో జరిగిన తొలి వన్డేలో మెరుగైన బ్యాటింగ్‌ను కనబరిచిన డుసెన్ తాజా ర్యాంకింగ్స్‌లో మూడు ర్యాంక్‌లను మెరుగుపరుచుకుని టాప్3లో చోటు సంపాదించాడు. ఇక పాకిస్థాన్ స్టార్ బాబర్ ఆజమ్ 892 రేటింగ్ పాయింట్లతో అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నాడు. పాకిస్థాన్‌కే చెందిన ఇమాముల్ హక్ రెండో ర్యాంక్‌లో నిలిచాడు. భారత స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి ఒక ర్యాంక్‌ను కోల్పోయి నాలుగో ర్యాంక్‌ను దక్కించుకున్నాడు. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తన ఐదో ర్యాంక్‌ను కాపాడుకున్నాడు. రోహిత్ 786 పాయింట్లతో ఐదో స్థానంలో కొనసాగుతున్నాడు. సౌతాఫ్రికా బ్యాటర్ డికాక్ ఆరో ర్యాంక్‌కు పడిపోయాడు. రాస్ టెలర్ (కివీస్), డేవిడ్ వార్నర్ (ఆస్ట్రేలియా), జానీ బెయిర్‌స్టో (ఇంగ్లండ్), అరోన్ ఫించ్ (ఆస్ట్రేలియా) టాప్10లో చోటు నిలబెట్టుకున్నారు. బౌలిగ్ విభాగంలో బౌల్ట్ 704 పాయింట్లతో టాప్ ర్యాంక్‌ను దక్కించుకున్నాడు.

బుమ్రా అతనికంటే ఒక పాయింట్ వెనుకబడి రెండో ర్యాంక్‌లో నిలిచాడు. షాహిన్ అఫ్రిది (పాకిస్థాన్) మూడో, జోష్ హాజిల్‌వుడ్ (ఆస్ట్రేలియా) నాలుగో, ముజీబుర్ రహ్మాన్ (అఫ్గాన్) టాప్5 ర్యాంకింగ్స్‌లో నిలిచారు. ఇక మహ్మద్ నబి (అఫ్గాన్) ఒక ర్యాంక్‌ను మెరుగు పరుచుకుని 8వ స్థానానికి చేరుకున్నాడు. ఆల్‌రౌండర్ల విభాగంలో షకిబ్ అల్ హసన్(బంగ్లాదేశ్) అగ్రస్థానాన్ని కాపాడుకున్నాడు. అఫ్గాన్ ఆటగాళ్లు మహ్మద్ నబి, రషీద్ ఖాన్ తర్వాతి ర్యాంకింగ్స్‌లో నిలిచారు. టీమిండియా నుంచి హార్దిక్ పాండ్య ఒక్కడే టాప్10లో నిలిచాడు. హార్దిక్‌కు తాజా ర్యాంకింగ్స్‌లో 8వ ర్యాంక్ దక్కింది. టీమ్ ర్యాంకింగ్స్‌లో న్యూజిలాండ్ అగ్రస్థానంలో కొనసాగుతోంది. ప్రపంచ చాంపియన్ ఇంగ్లండ్ రెండో, మాజీ విజేత భారత్ మూడో ర్యాంక్‌లో నిలిచాయి. పాకిస్థాన్, ఆస్ట్రేలియా టీమ్‌లు టాప్5లో చోటు నిలబెట్టుకున్నాయి.

Bumrah Slips to 2nd spot in ICC ODI Rankings

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News