Monday, November 25, 2024

ఆర్‌కె భార్యకు ఎన్‌ఐఎ నోటీసులు

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ విజయవాడలో కుల నిర్మూలన పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు ప్రభాకర్, డప్పు కళాకారుడు రమేశ్ ఇళ్లతో పాటు ప్రకాశం జిల్లాలో ఆర్‌కె భార్య శిరీష ఇంట్లో అధికారులు సోదాలు జరిపిన ఎన్‌ఐఎ అధికారులు వారికి నోటీసులు జారీ చేశారు. రెండేళ్ల క్రితం ఛత్తీస్‌గడ్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో లభించిన ఆధారాల మేరకు ఈ తనిఖీలు నిర్వహించారు. ఆర్‌కె సతీమణి శిరీష, కెఎన్‌పిఎస్ రాష్ట్ర అధ్యక్షుడు డప్పు ప్రభాకర్‌లు మావోయిస్టులతో సంబంధాలు కొనసాగిస్తున్నారనే అనుమానంతో ఛత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాల ఎన్‌ఐఏ అధికారుల బృందం ఈ సోదాలు చేసినట్లు సమాచారం. ప్రభాకర్ సన్నిహితులు, కుటుంబ సభ్యుల బ్యాంకు లావాదేవీల వివరాలు సేకరించినట్లు తెలుస్తోంది. ఇదిలావుండగా ఎన్‌ఐఎ దాడులు అప్రజాస్వామిక చర్యగా ప్రభాకర్ పేర్కొన్నారు.

తనకీలలో సెల్‌ఫోన్, కొన్ని పత్రాలు, వీడియోలు తీసుకుని నోటీసు ఇచ్చి వెళ్లారని ప్రభాకర్ మీడియాకు చెప్పారు.కాగా ఇటీవల మరణించిన డప్పు కళాకారుడు, జననాట్య మండలి నాయకుడు డప్పు రమేశ్ ఇంట్లోనూ ఎన్‌ఐఏ అధికారులు సోదాలు జరిపారని, న్యూ రాజరాజేశ్వరీపేట అమరావతి కాలనీలోని రమేశ్ భార్య జ్యోతి ఇంట్లో మంగళవారం రాత్రి 7.15 గంటల వరకు తనిఖీలు చేశారని తెలిపారు. ఎన్‌ఐఎ సోదాలను వ్యతిరేకిస్తూ ప్రజా సంఘాలు కొద్దిసేపు ఆందోళన చేపట్టడంతో పాటు ఉపా చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ నాయకులు ప్లకార్డులు ప్రదర్శించారు.

NIA Notice to RK’s Wife Shirisha

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News