- Advertisement -
రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో భాగంగా జూబ్లీహిల్స్ జిహెచ్ఎంసి పార్క్లో సినీ నటి మీనాక్షి దీక్షిత్ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మీనాక్షి దీక్షిత్ మాట్లాడుతూ.. ఇంత మంచి కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటడం సంతోషంగా ఉందన్నారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరు వీలైనన్ని మొక్కలు నాటాలని ఆమె కోరారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ చేపట్టిన ఎంపి సంతోష్ కుమార్కు కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీప్రసాద్, కన్నడ నటుడు సౌరవ్ లోకేష్, డిజైనర్ అర్చిత నారాయణ్ ముగ్గురికి మీనాక్షి దీక్షిత్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఇచ్చారు.
Actress Meenakshi Deekshit plant sapling in Jubilee Hills
- Advertisement -