Monday, December 23, 2024

నిజాం ప్రజల సంఘం

- Advertisement -
- Advertisement -

Excavation for Charminar defenses:Archaeology officials

నిజాం అభినందన సభ
l హైదరాబాద్‌లో నిజాంకు కృతజ్ఞత తెలియజేయడానికి ఒక పెద్ద బహిరంగ సభను ఏర్పాటు చేశారు.
l ఈ సభలో పాల్గొన్న ముల్కీ ఉద్యమ నాయకులు
1. పద్మజా నాయుడు
2. లతీఫ్ సయిద్
3. బూర్గల రామక్రిష్ణారావు
4. మీర్ హసనోద్దిన్ (మమ్లకత్ ఉర్ధూ వార పత్రిక సంపాదకుడు)
5. మందమూల నరసింహారావు (రమ్యత్ పత్రిక సంపాదకుడు)
6. రాజా ధాండేరాజు
7. మీర్ అక్బర్ అలీఖాన్
8. హుమయూన్ మీర్జా
9. నవాజ్ షంషేర్ జంగ్
రాజ్యాంగ సంస్కరణల కమిటీ
l 1937లో 7వ నిజాం హైదరాబాద్ రాజ్యంలో రాజ్యాంగ సంస్కరణలపై వేసిన కమిటీ అరవముదు అయ్యంగార్ కమిటీ.
l 1038లో అనేక రాజ్యాంగ సంస్కరణలను సూచిస్తూ తన నివేదికను సమర్పించింది.
l ఈ కమిటీ నివేదికలో ఉద్యోగాలకు సంబంధించి స్థానికులకే అధిక ప్రాధాన్యం ఇచ్చారు.
l అప్పటి వరకు జారీ చేసిన ఫర్మానాలను చిత్తశుద్ధితో అమలు చేయాలని సూచించింది.
l ప్రభుత్వ ఉద్యోగాల నియామకం కొరకు ప్రత్యేకమైన యంత్రాంగాన్ని రూపొందించాలని తెలిపింది.
l ఈ కమిటీ సూచనల ఆధారంగా 1919 ఫర్మానాలోని ఆర్టికల్ 39ను 1945 నుండి పూర్తి స్థాయిలో అమలు చేశారు.
1935 నిజాం ప్రజల సంఘం/నిజాం ముల్కీలీగ్ ఏర్పాటుకు కారణాలు
l ముల్కీలీగ్ ఉద్యమ నేత సయ్యద్ అబిద్ హసన్ రచించిన పుస్తకం పేరు WITHER HYDERABAD.
l దీని ప్రకారం ఉత్తర ప్రదేశ్, పంజాబ్ నుండి వచ్చిన వారిలో ఎక్కువ మంది ఉద్యోగాల్లో స్థిరపడ్డారు.
l రాజపఠానా, మర్వార్ ప్రాంతాల నుండి వచ్చినవారు వడ్డీవ్యాపారం, ఇతర వాణిజ్య రంగాలలో స్థిరపడ్డారు.
l ఉత్తర భారతదేశానికి చెందిన గైర్ ముల్కీలు పరిపాలనా వ్యవహారాలలో ఇతరులను అనుమతించేవారు కాదు.
l తమకు తాము ఈ రాజ్యపాలకులమని భావించే వారు.
l ఆంధ్రా ప్రాంతం, బొంబాయి, సెంట్రల్ ప్రావెన్సెస్, బెరార్ తదితర ప్రాంతాల నుండి పెద్ద ఎత్తున గైర్ ముల్కీలు వలస వచ్చి హైదరాబాద్ నగరంలో, సంస్థానంలో, వివిధ పట్టణాలలో స్థిరపడటం.
l నాన్ ముల్కీలు తామే అర్హతలు ఉన్న వారమని, బాగా చదువుకున్న వారమని ముల్కీ అభ్యర్థులను ప్రక్కకు పెట్టడం
l ఈ విషయాల వల్ల స్థానిక యువకుల్లో, అభ్యుదయ వాదులలో, విద్యాధికులలో అసంతృప్తి రగిలిన ఫలితమే ముల్కీలీగ్ ఏర్పాటు.
ముల్కీలీగ్ ఏర్పాటు-1935
l ముల్కీల హక్కులు కాపాడుటకు, పౌరసత్వపు హక్కులు సంపాదించుటకు ప్రభుత్వం ప్రజలచే ఎన్నుకోబడిన శాసన సభల జవాబుదారి వహించునటువంటి రాజకీయ సంస్కరణలు సాధించడానికి, ఒక ప్రజా సంస్థ అవసరమని భావించి నిజాం ప్రజల సంఘం అనే సంస్థను స్థాపించారు.
l నిజాం ప్రజల సంఘం స్థాపించబడిన సంవత్సరం 1934
l దీనినే ఉర్ధూలో జమీమత్ రిపాయా మేనిజాం అంటారు.
l ఈ సంస్థనే 1935 నాటికి నిజాం ముల్కీలీగ్‌గా రూపాంతరం చెందింది.
l ముల్కీలీగ్ అధ్యక్షులు నవాబ్ సర్ నిజాముత్ జంగ్
l ఇతను నిజాం మంత్రి మండలిలో రాజకీయ శాఖ మంత్రిగా పనిచేసి 1930లో పదవి నుండి తప్పుకున్నాడు.
l ఉపాధ్యక్షులు 1. డా. లతీఫ్ సయిద్ 2. రామచంద్రనాయక్
l కార్యదర్శలు 1. సయిద్ అబిద్ హసన్ 2. బూర్గుల రామకృష్ణారావు 3. శ్రీనివాసరావు శర్మ.
l కోశాధికారి బారిష్టర్ నౌషిర్ చినామ్.
l ఈ సంస్థ 18 సభ్యులతో తన కార్యదర్శి ఏర్పాటు చేశారు.
పత్రికలు
l మందమూల నర్సింగరావు స్థాపించిన పత్రిక రమ్యత్ పత్రిక
l అహ్మద్ మొహద్దీన్ రహబత్ ఇ దక్కన్ పత్రిక
l మీర్ హసనుద్దిన్ మమ్లకత్ పత్రిక.
ఈ సంస్థ ఉద్దేశాలు
l దక్కనీ సంస్కృతి, భాషా పరిరక్షణే తమ ఉద్యమం అని ప్రకటించింది.
l నాన్ ముల్కీలను ఉద్యోగాల నుండి తొలగించి వారి స్థానంలో ముల్కీలను నియమించి, భాద్యతాయుత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ఉద్యమించింది.
l బ్రిటీష్ వారి ఒత్తిడిని, సలహాలను నిజాం పక్కన బెట్టాలని, తమ పాలనకు పూర్వ వైభవం తేవాలని ముల్కీలీగ్ ప్రచారం చేసింది.
l బ్రిటీష్ వారిని, నాన్ ముల్కీలను ముల్కీలీగ్ ప్రత్యర్థులుగా భావించింది.
l నిజాం సార్వభౌమాదిపత్యం, రాజ్యాంగబద్దమైన పరిపాలన, సంస్థానంలో పూర్వం అమల్లో ఉన్న జాగీర్ధార్లు, దేశ్‌ముఖ్‌ల వ్యవస్థ తిరిగి ఏర్పాడాలని ముల్కీలీగ్ అభిప్రాయం.
l నిరుద్యోగ సమస్య: ఉత్తర భారతదేశ నాన్‌ముల్కీల ఆదిపత్యదోరణి వల్లే ముల్కీ ఉద్యమం ప్రారంభమైందని ముల్కీలీగ్ స్పష్టం చేసింది.
l దక్కనీ జాతీయతను ముల్కీలీగ్ ప్రచారం చేసింది.
l హైదరాబాద్ సంస్థానపు కామన్ లాంగ్వేజ్‌గా హిందుస్థానీని (హింది) ప్రోత్సహించాలని తెలిపింది.
ఈ సంస్థ అంతానికి కారణాలు
l 1937లో ముల్కీలీగ్‌లో చీలిక వచ్చి దాని నుండి బయటికి వచ్చిన హిందువులు ప్రారంభించిన సంస్థ పీపుల్స్ కన్వెన్షన్
l హరిపుర (గుజరాత్)లో 1938లో జరిగిన కాంగ్రెస్ జాతీయ సభలకు సంస్థానం నుండి 500 మంది యువకులు వెల్లివచ్చి స్టేట్ కాంగ్రెస్ స్థాపించారు.
l ముల్కీలీగ్‌ను నడిపిన కొందరు ముఖ్యనాయకులు కాంగ్రెస్ స్థాపించడంలో ప్రధాన పాత్ర వహించారు.
l ముల్కీలీగ్ కొనసాగింపే 1938లో ప్రారంభించబడిన హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్. కొంత మంది ముస్లింలు ఎంఐఎంలో చేరారు.
l ఈ పరిణామాలతో 1939లో ముల్కీలీగ్ అంతమైంది.

18 సభ్యులతో నిజాం ముల్కీలీగ్ కార్యదర్శి వర్గం

1. రాజబహదూర్ వెంకట్రామిరెడ్డి
2. అక్బర్ అలీఖాన్
3. అబుల్ హసన్ సయ్యద్ అలి
4. శంకర్‌రావు బోర్గీంకర్
5. ఖలీలుజ్జామా
6. శ్రీపతిరావు
7. నవాబ్ షంషేర్ జంగ్
8. కాశీనాధరావు వైద్య
9. గోపాలరావు వకీలు
10.జనార్ధన్‌రావు దేశాలు
11.మందముల నర్సింగరావు
12.నవాబ్ మెయిన్ మార్‌జంగ్
13.వామన్ నాయక్
14.మాడపాటి హనుమంతరావు.
15.వివి జోషి
16.అహమ్మద్ మొహద్దిన్
17.మీర్‌హసనోద్దిన్
18.నవాబ్ బహదూర్‌మార్ జంగ్

కరెంట్ అఫైర్స్:

ఎన్‌ఐఆర్‌ఎఫ్ ర్యాంకింగ్స్ 2022
F దేశంలో అత్యుత్తమ విద్యా సంస్థల జాబితాలో ఐఐటి మద్రాస్ వరసగా నాలుగో ఏడాది తొలి స్థానంలో నిలిచింది.
F నేషనల్ ఇనిస్టిట్యూషనల్ ర్యాకింగ్స్ ఫ్రేమ్‌వర్క్ (ఎన్‌ఐఆర్‌ఎఫ్) కింద 11 విభాగాల్లో ర్యాంకుల జాబితాను కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ జూలై 15న విడుదల చేశారు.
F 2016 నుంచి కేంద్ర విద్యాశాఖ ఈ ర్యాంకులను ప్రకటిస్తోంది.
F ఉత్తమ విశ్వవిద్యాలయాల విభాగంలో ఇండియాన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరు తొలి స్థానం దక్కింది.
F ఫార్మసీ విభాగంలో నైపర్ హైదరాబాద్ రెండో ర్యాంకు, న్యాయ విద్యలో హైదరాబాద్‌లోని నల్సార్ యూనివర్సిటీ ఆఫ్‌లా నాలుగో ర్యాంకు సాధించాయి.
F ఉస్మానియా యూనివర్సిటీ 22వ ర్యాంకు, ఆంధ్ర యూనివర్సిటీ 36వ ర్యాంకు లభించింది.
ఓవరాల్ ర్యాంకింగ్
సంస్థ ర్యాంకు
ఐఐటీ మద్రాస్ 1
ఐఐఎస్సీ బెంగళూరు 2
ఐఐటీ బాంబే 3
ఐఐటీ హైదరాబాద్ 14
యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ 20
ఎన్‌ఐటి వరంగల్ 45
ఉస్మానియా యూనివర్సిటీ 46
200 కోట్ల కొవిడ్ డోసులు
F కొవిడ్ వ్యాక్సినేషన్‌లో జూలై 17న దేశం కీలక మైలురాయిని దాటింది. వ్యాక్సినేషన్ కార్యక్రమంలో 18 నెలల వ్యవధిలో 200 కోట్ల డోసులు పైగా పంపిణీ చేసింది.
F మొత్తం రెండు కోట్ల 15 వేల 631 డోసులు వేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.
F దేశంలోని వయోజనుల్లో 98% మంది కనీసం ఒక్క డోసైనా వాక్సిన్ వేయించుకోగా, 90% మంది కనీ సం ఒక్క డోసైనా వ్యాక్సిన్ వేయిం చుకోగా, 90% మంది పూర్తి రెండు డోసులు వేసుకున్నారని తెలిపింది.

వెంకటరాజం బొడ్డుపల్లి,
రామప్ప అకాడమీ

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News