హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ గా ఖాజా ముజీబుద్దీన్ గురువారం హజ్ హౌజ్ లోని తన కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్, మహమూద్ అలీ, ఎమ్మెల్సీ కవిత, ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్, ఎమ్మెల్యే హన్మంతు షిండే పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పలువురు ప్రజాప్రతినిధులు, టిఆర్ఎస్ నాయకులు హాజరుకాడంతో పాటు ఖాజాకు శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ కోసం నిబద్దత తో పని చేసే వారిని అధిష్టానం కచ్చితంగా గుర్తిస్తుందని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా వేముల మాట్లాడారు.
దానికి ఉదాహరణ ముజీబుద్దిన్ అని అన్నారు. ఆయన నిబద్ధతకు ప్రతిఫలంగా కామారెడ్డి జిల్లా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా, ఉర్దూ అకాడెమీ చైర్మన్ గా అవకాశం లభించిందన్నారు. ముజీబుద్దిన్ తనకు అత్యంత ఆప్తుడని, ఆయనకు ఉర్దూ అకాడమీ చైర్మన్ గా అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి కెసిఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ కు మంత్రి వేముల కృతజ్ఞతలు తెలిపారు.
- Advertisement -