- Advertisement -
హైదరాబాద్: నగరంలో లైవ్‌లో గేమ్స్ ఆడుతూ య్యూటూబ్‌ర్ డీనా ఆత్మహత్య చేసుకున్నాడు. హైదరాబాద్ లోని సైదాబాద్ లో ఈ ఘటన చోటుచేసుకుంది. గ్వాలియర్‌లో ఐఐటీ ఇంజినీరింగ్ చదువుతున్న డీనా య్యూటూబ్ లో లైవ్ గేమ్స్ ఆడుతూ డిప్రెషన్ తోకి వెళ్లి బలవన్మరణానికి పాల్పడినట్లు తెలుస్తోంది. యూట్యూబ్‌లో వ్యూయర్స్ పెరగడంలేదంటూ ఆందోళన వల్లే ఈ దారుణానికి పాల్పడినట్లు సమాచారం. కొద్దిసేపటిక్రితమే యూట్యూబ్ లైవ్‌లో గేమ్ ఆడిన డీనా భవనంపై నుంచి దూకి ప్రాణాలు తీసుకున్నాడు. గేమ్ ఆడుతూ తన బాధను చెప్పుకున్నాడు. ఎవరూ ఎలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దంటూ సూచించాడు. లైవ్‌లో గేమ్స్ ఆడడంలో డీనా దిట్ట. యూట్యూబ్‌లో selflo గేమ్ ఛానెల్‌ను నిర్వహిస్తున్నాడు.
- Advertisement -