పార్లమెంట్ అనగా లోక్‌సభ, రాజ్యసభ, రాష్ట్రపతి అని అర్థం.
రాష్ట్రపతి పార్లమెంట్‌లో అంతర్భాగం.
ఒక బిల్లు చట్టం కావాలంటే రాష్ట్రపతి ఆమోదం అవసరం.
రాజ్యసభ
ఆర్టికల్ 80: రాజ్యసభ గురించి పేర్కొంటుంది.
రాజ్యసభకు ఉన్న వివిధ పేర్లు: ఎగువసభ, మేదావుల సభ, రాష్ట్రాల పరిషత్, రాష్ట్రాల మండలి.
రాజ్యసభ సభ్యుల సంఖ్య : 250(గరిష్టం)
రాజ్యసభ ప్రస్తుత సభ్యుల సంఖ్య 245, వీరిలో రాష్ట్రాల నుండి 229, కేంద్రపాలిత ప్రాంతాలు ఢిల్లీ, పాండిచ్చేరి నుండి 4, రాష్ట్రపతి 12 మంది విశిష్ట వ్యక్తులను నామినేట్ చేస్తారు.
కళలు, సాహిత్యం, సైన్స్, సామాజిక సేవ రంగాలలో నిష్ణాతులైన 12 మందిని రాష్ట్రపతి నామినేట్ చేస్తారు.
సభ్యుల అర్హత
భారతీయుడై ఉండాలి.
30 ఏళ్ల వయసుండాలి.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలలో ఉండరాదు.
ఒక వేళ ఉంటే రాజీనామా చేయాలి.
సొంత రాష్ట్రం అయి ఉండవలసని అవసరం లేదు.
సభ్యుల పదవికాలం
రాజ్యసభ సభ్యుల పదవి కాలం సాధారణంగా 6ఏళ్లు.
ప్రతి 2 ఏళ్లకు 1/6వ వంతు సభ్యులు పదవి విరమణ చేయగా ..తిరిగి అంతే సభ్యులు నియామకం అవుతారు.
రాజ్యసభ సదవీకాలం శాశ్వతం. రాజ్యసభ శాశ్వతసభ. దీనిని ఎవరూ రద్దు చేయలేరు.
రాజ్యసభను శాశ్వతసభ, నిరంతర సభ, పాతకొత్తల మేళవింపు అని పిలుస్తారు.
రాజ్యసభ ప్రత్యేకతలు
రిజర్వేషన్లు ఉండవు.
నియోజక వర్గాలు ఉండవు.
రాష్ట్ర నివాసి కానవసరం లేదు.
రాజ్యసభ నుండి మంత్రి పదవి చేపట్టిన వ్యక్తి లోక్‌సభకు బాధ్యత వహించాలి. మంత్రిగా ఉండేది ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే. ప్రభుత్వం అధికారంలో ఉండేది లోక్‌సభ విశ్వాసం ఉన్నంతవరకే
ప్రశ్న: రాజ్యసభ సీట్లను ఎలా నిర్ణయిస్తారు? (4)
a. జనాభా
b. రాష్ట్రపతి ఇష్టానుసారం c.పార్లమెంట్ నిర్ణయిస్తుంది. d. ఎంఎల్‌ఏల సంఖ్య
1. పైవన్నీ 2. a,b
3. a, c 4. a,d
ప్రాథమిక విధులు
w జనవరి 3ను ప్రాథమిక విధుల దినోత్సవంగా పాటిస్తారు.
w రాజ్యాంగ ప్రారంభంలో ప్రాథమిక విధులు లేవు.
w భారత రాజ్యాంగం ప్రాథమిక విధులను యూఎస్‌ఎస్‌ఆర్ నుండి గ్రహించింది.
స్వరణ్‌సింగ్ కమిటీ
w స్వరణ్ సింగ్ 13 ప్రాథమిక విధులను సిఫార్సు చేశాడు.
w 13 విధుల్లో భారత రాజ్యాంగం పది విధులను తీసుకుంది.
w ప్రాథమిక విధులను 1976లో ఇందిరా గాంధీ ప్రభుత్వం 42వ సవరణ చేసి రాజ్యాంగంలో చేర్చింది.
w ఇవి పౌరులు సమాజంపట్ల, వ్యక్తులపట్ల, రాజ్యంపట్ల ఏయే విధులు నిర్వర్తించాలో తెలుపుతుంది.
1. జాతీయ జెండా, జాతీయ గీతం, భారత రాజ్యాంగాన్ని గౌరవించాలి.
2. దేశ రక్షణలో పాటు పడాలి.
3. సోదర భావం (పౌరుల పట్ల సోదర భావం కలిగి ఉండాలి, మహిళల గౌరవం భంగం కలిగించరాదు)
4. సమైక్యత సమగ్రత కాపాడాలి.
5. సార్వభౌమత్వం (సర్వసత్తాక) భారతదేశ సార్వభౌమత్వంను కాపాడాలి.
6. పర్యావరణంను కాపాడాలి, వన్యమృగ సంరక్షణ చేయాలి.
7. దేశ సంపద రక్షించాలి.
8. శాస్త్రీయ దృక్పదం ఉండాలి, మూఢనమ్మకాలు వీడాలి.
9. ఉమ్మడి సంస్కృతిని కాపాడాలి.
10. (ఔనత్యం) వ్యక్తి గతంగా ఔనత్యంను చేరుకోవాలి.
11. 614 ఏళ్ల బాలబాలికలకు నిర్భంద విద్య అందించడం తల్లిదండ్రుల, సంరక్షకుల విధి.
లక్షణాలు
ఇవి పౌరులకు నిర్దేశించినవి
వీటికి న్యాయసంరక్షణ లేదు
విధులను అమలు చేయాలని కోర్టుకు వెళ్లరాదు.
విధులను పాటించాలని కోర్టుకు వెళ్లలేము కాని వాటిని దిక్కరిస్తే శిక్షకు అర్హులవుతారు.
ఇవి అనుకూల స్వభావం కలిగి ఉనాయి.
జె.ఎస్ వర్మ కమిటీ..
ప్రాథమిక విధుల అమలు కోసం చట్టాలు చేయలా వద్దా ? అని కమిటీ వేశారు. క
విధులను అమలు చేయాలని చట్టాలు చేయాల్సిన అవసరం లేదు. ఉన్న వాటిని సక్రమంగా అమలుచేయాలి.
ఉదా: వన్యమృగ సంరక్షణ చట్టం 1972.
అటవి జంతువులను చంపరాదు.
ప్రశ్న: ప్రాథమిక విధులలో లేనిది ఏది? (1)
a. సకాలంలో పన్ను చెల్లింపు. b. 614 ఏళ్ల పిల్లల చదువు బాధ్యత ప్రభుత్వానిది
c. జాతీయ ప్రాధాన్యం కలిగిన పురావస్తు ఆలయాలు, వస్తువులన రక్షించాలి.
d. జాతీయ పథకం (జాతీయ జెండాను) రక్షించాలి.
1. abcd 2. a
3. b 4.b,d
డా.బిఎస్‌ఎన్ దుర్గాప్రసాద్, డైరెక్టర్ తక్షశిల ఐఏఎస్ అకాడమీ.