- Advertisement -
తిరువనంతపురం: దేశంలో మూడో మంకీ పాక్స్ వ్యాధి కేరళలో నమోదైంది. మలప్పురం జిల్లాలో 35 ఏళ్ల వ్యక్తికి శుక్రవారం వ్యాధి సోకింది. జూలై 6న అతడు యూఏఈ నుంచి వచ్చాడు. జూలై 13న జ్వరంతో బాధపడుతున్న ఆయన చికిత్స తీసుకున్నారు. జూలై 15న అతని శరీరంపై దద్దుర్లు కనిపించాయి. ప్రస్తుతం అతను జిల్లాలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో చికిత్స పొందుతున్నాడు. అతని పరిస్థితి నిలకడగా ఉందని వెల్లడించారు. అతడితో కాంటాక్ట్ లోకి వచ్చిన వారినందరిపై నిఘా పెట్టారు. కేరళ రాష్ట్రంలో ఇంతకుముందు రెండు మంకీపాక్స్ కేసులు నమోదయ్యాయి. మొదటిది కొల్లం జిల్లాలో, రెండవది కన్నూర్‌లో. ముగ్గురూ యూఏఈ నుంచి వచ్చినవారే. కన్నూర్‌లోని వ్యాధి సోకిన వ్యక్తి మంగళూరు విమానాశ్రయం ద్వారా వచ్చారు.
- Advertisement -