Monday, December 23, 2024

ఆగస్టు 13-15 మధ్య ఇంటింటా జాతీయ జెండా

- Advertisement -
- Advertisement -

13-15 August National flag at home : PM Modi

ప్రజలకు ప్రధాని మోడీ పిలుపు

న్యూఢిల్లీ: ఆజాదీ కా అమృత్ మహోత్సవాలలో భాగంగా ఆగస్టు 13-15 మధ్య దేశంలోని ప్రతి పౌరుడు తమ ఇంటిపై జాతీయ పతాకాన్ని ఎగురవేసి హర్ ఘర్ తిరంగ ఉద్యమాన్ని బలపరచాలని ప్రధాని నరేంద్ర మోడీ దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ ఉద్యమం త్రివర్ణపతాకంతో మన అనుబంధాన్ని మరింత బలోపేతం చేస్తుందని గురువారం ట్విట్టర్ వేదికగా ప్రధాని పేర్కొన్నారు. 1947 ఆగస్టు 22న మన జాతీయ పతాకం స్వీకరించడం జరిగిందని ఆయన గుర్తు చేశారు. వలస పాలకులపై పోరాటం సాగిస్తున్న నాడు స్వతంత్ర భారతదేశానికి ఒక జాతీయ పతాకం కోసం కలలు కన్న ఆ ధీరోదాత్తులను మనం ఈనాడు స్మరించుకుంటున్నామని, వారు కన్న కలలను సాకారం చేసి నవ భారత నిర్మాణానికి కంకణబద్ధులవుతామని పునరుద్ఘాటిద్దామని ప్రధాని పిలుపునిచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News