Monday, December 23, 2024

‘నాట్యం’ సినిమాకు జాతీయ అవార్డులు

- Advertisement -
- Advertisement -

ఉత్తమ కొరియోగ్రాఫర్
సంధ్యా రాజు ఉత్తమ మేకప్
టి.వి. రాంబాబు

ఉత్తమ సంగీతం (పాటలు)
తమన్ (అల వైకుంఠపురములో)

ఉత్తమ తెలుగు చిత్రం : కలర్ ఫోటో

ఉత్తమ నటులు :సూర్య, అజయ్ దేవగన్
ఉత్తమ నటి : అపర్ణ బాలమురళి
అవార్డు గ్రహీతలకు అభినందనలు:
ఎఫ్‌డిసి చైర్మన్ అనిల్ కుర్మాచలం

68వ జాతీయ చలనచిత్ర పురస్కారాలను కేంద్ర ప్రభుత్వం శుక్రవారం సాయంత్రం ప్రకటించింది. జాతీయ ఉత్తమ నటులుగా సూర్య, అజయ్ దేవగణ్, ఉత్తమ నటిగా అపర్ణా బాలమురళి ఎంపికయ్యారు. ఇక ఈ జాతీయ అవార్డుల్లో తెలుగు సినిమాలు సత్తా చాటాయి. ఉత్తమ తెలుగు చిత్రంగా ‘కలర్ ఫొటో’ ఎంపిక కాగా ఉత్తమ కొరియోగ్రఫీ, మేకప్ విభాగాల్లో ‘నాట్యం’, ఉత్తమ సంగీత చిత్రంగా ‘అల వైకుంఠపురములో’ అవార్డులు దక్కించుకున్నాయి. ఇక ఈ ఏడాది అవార్డులను ఐదు కేటగిరీలుగా విభజించారు. ఫీచర్ ఫిల్మ్, నాన్ ఫీచర్ ఫిల్మ్, దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు, బెస్ట్ రైటింగ్ సెక్షన్, మోస్ట్ ఫిల్మ్‌ఫ్రెండ్లీ స్టేట్ కేటగిరీల్లో అవార్డులను ప్రకటించారు. మోస్ట్ ఫిల్మ్ ఫ్రెండ్లీ స్టేట్ అవార్డును మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్‌లు సొంతం చేసుకున్నాయి. ఇక దాదా సాహెబ్ ఫాల్కే అవార్డును మరోసారి ప్రకటించనున్నట్లు జ్యూరీ సభ్యులు తెలిపారు.

68వ జాతీయ పురస్కారాల్లో ఉత్తమ నటుడి అవార్డును ఇద్దరు హీరోలు అందుకోనున్నారు. ‘సూరారైపోట్రు’లో(ఆకాశం నీ హద్దురా) నటనకుగానూ సూర్య, ‘తానాజీ’లో నటనకు అజయ్ దేవగణ్ ఉత్తమ నటులుగా ఎంపికయ్యారు. అలాగే ఉత్తమ నటిగా అపర్ణా బాలమురళి (సూరారైపోట్రు)ని జాతీయ పురస్కారం వరించింది. జాతీయ ఉత్తమ చిత్రంగా ‘సూరారై పోట్రు’ నిలిచింది. ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ సినిమాకుగాను ఉత్తమ దర్శకుడిగా దివంగత కె.ఆర్.సచ్చిదానందన్‌కు అవార్డు దక్కింది. ‘అల వైకుంఠపురములో’ చిత్రానికిగాను ఉత్తమ సంగీత దర్శకుడుగా (పాటలు) తమన్‌ను అవార్డు వరించింది. ఈ ఏడాది మొత్తం 30 భాషల్లో 305 ఫీచర్ ఫిల్మ్ ఎంట్రీకి వచ్చాయి. నాన్ ఫీచర్ ఫిల్మ్ కేటగీరీలో 148 చిత్రాలు (20 భాషల్లో) స్క్రీనింగ్ వచ్చినట్లు జ్యూరీ సభ్యులు తెలిపారు.

జాతీయ అవార్డు విజేతల వివరాలు ః

ఉత్తమ చిత్రం ః సూరారై పోట్రు

ఉత్తమ నటుడు ః సూర్య (సూరారై పోట్రు), అజయ్ దేవగణ్ (తానాజీ)

ఉత్తమ నటి ః అపర్ణ బాలమురళి (సూరారై పోట్రు)

ఉత్తమ దర్శకుడు ః దివంగత కె.ఆర్.సచ్చిదానందన్ (అయ్యప్పనుమ్ కోషియమ్)

ఉత్తమ సహాయనటుడు ః బిజుమీనన్ (అయ్యప్పనుమ్ కోషియమ్)

ఉత్తమ సహాయ నటి ః లక్ష్మీ ప్రియా చంద్రమౌళి (శివ రంజినీయుము ఇన్నుమ్ సిలా పెంగళం)

ఉత్తమ సంగీతం (పాటలు) ః తమన్ (అల వైకుంఠపురములో)

ఉత్తమ నేపథ్య సంగీతం ః జివి ప్రకాష్ కుమార్ (సూరారై పోట్రు)

ఉత్తమ నేపథ్య గాయని ః సన్‌చ్చమ్మ (మలయాళం) – అయ్యప్పనుమ్ కోషియుమ్

ఉత్తమ నేపథ్య గాయకుడు ః వసంత రావు (మరాఠీ) – రాహుల్ దేశ్ పాండే

ఉత్తమ సినిమాటోగ్రఫీ ః అవిజాత్రిక్ (బెంగాల్) – సుప్రితిమ్ భోల్

ఉత్తమ కొరియోగ్రఫీ ః నాట్యం (సంధ్యారాజు)

ఉత్తమ మేకప్ ః నాట్యం (టి.వి.రాంబాబు)

ఉత్తమ కాస్ట్యూమ్స్ ః నచికేత్ బర్వే, మహేష్ శర్లా (తానాజీ)

ఉత్తమ స్టంట్స్ ః అయ్యప్పనుమ్ కోషియమ్

ఉత్తమ బాల నటుడు ః అనిశ్ మంగేశ్ గోస్వామి (టక్ టక్), ఆకాంక్ష పింగ్లే, దివ్వేష్ టెండుల్కర్ (సుమీ) మరాఠీ చిత్రాలు

మోస్ట్ ఫిలిం ఫ్రెండ్లీ స్టేట్ – మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్

నాన్ ఫీచర్ ఫిలింస్…

బెస్ట్ వాయిస్ ఓవర్ ః శోభా రాప్సోడీ ఆఫ్ రెయిన్స్- మాన్‌సూన్స్ ఆఫ్ కేరళ (ఇంగ్లీష్)

బెస్ట్ మ్యూజిక్ డైరెక్షన్ ః విశాల్ భరద్వాజ్ (మరేంగే తో వహీన్ జాకర్) (హిందీ)

బెస్ట్ ఎడిటింగ్ ః అనాదీ అతలే (బార్డర్ ల్యాండ్స్)

బెస్ట్ ఆన్‌లొకేషన్ సౌండ్ రికార్డిస్ట్ ః సందీప్ భాటి, ప్రదీప్ లెహ్వార్ (జాదూయ్ జంగల్) (హిందీ)

బెస్ట్ ఆడియోగ్రఫీ (ఫైనల్ మిక్స్‌డ్ ట్రాక్) ః అజిత్ సింగ్ రాథోడ్ (పర్ల్ ఆఫ్ ద డిసర్ట్ ) (రాజస్థానీ) బెస్ట్ సినిమాటోగ్రఫీ ః నిఖిల్

ఎస్ ప్రవీణ్ (శబ్దికున్ కలప్ప) (మలయాళం) ఉత్తమ డైరెక్షన్: ఆర్‌వీ రమణి – ఓ దట్స్ భాను (ఇంగ్లీష్, తమిళ్, మలయాళం,

హిందీ)ఉత్తమ కుటుంబ కథా చిత్రం: కుంకుమార్చన్ (మరాఠి)

బెస్ట్ షార్ట్ ఫిక్షన్ ఫిలిం ః కచీచినుతు (అస్సాం)

స్పెషల్ జ్యూరీ అవార్డ్: అడ్మిటెడ్ (హిందీ, ఇంగ్లీష్)

బెస్ట్ ఇన్వెస్టిగేటివ్ ఫిలిం ః ద సేవియర్: బ్రిగేడియర్ – ప్రీతమ్ సింగ్ (పంజాబీ)

బెస్ట్ ఎక్స్‌ప్లోరేషన్ ఫిలిం ః వీలింగ్ ద బాల్ (ఇంగ్లీష్, హిందీ)

బెస్ట్ ఎడ్యుకేషనల్ ఫిలిం: డ్రీమింగ్ ఆఫ్ వరడ్స్ (మలయాళం )

బెస్ట్ ఫిలిం ఆన్ సోషల్ ఇష్యూస్ ః జస్టిస్ డిలేయ్‌డ్ బట్ డెలివర్‌డ్ (హిందీ), 3 సిస్టర్స్ (బెంగాలీ)

బెస్ట్ ఎన్వైర్‌మెంట్ ఫిలిం ః మాన అరు మానుహ్ (అస్సామీస్)

బెస్ట్ ప్రొమోషనల్ ఫిలిం ః సర్‌మొంటింగ్ చాలెంజెస్ (ఇంగ్లీష్)

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News