- Advertisement -
న్యూఢిల్లీ: కశ్మీరు వేర్పాటువాద నాయకుడు, నిషిద్ధ జమ్మూ కశ్మీరు లిబరేషన్ ఫ్రంట్(జెకెఎల్‌ఎఫ్) చీఫ్ యాసిన్ మాలిక్ ఇక్కడి తీహార్ జైలులో నిరాహార దీక్ష చేపట్టినట్లు శనివారం అధికారులు వెల్లడించారు. మాలిక్ నిరాహార దీక్ష వెనుక కారణాన్ని తెలియచేయడానికి జైలు అధికారులు నిరాకరించగా తనను జైలులో సక్రమంగా చూడటం లేదని అతను ఆరోపించినట్లు వర్గాలు తెలిపాయి. శుక్రవారం ఉదయం నుంచి మాలిక్ నిరాహార దీక్ష చేస్తున్నట్లు ఒక సీనియర్ జైలు అధికారి చెప్పారు. ఉగ్రవాదులకు నిధులు సమకూర్చిన కేసులో ఢిల్లీ కోర్టు ఇచ్చిన తీర్పు మేరకు ఈ ఏడాది మే నుంచి మాలిక్ జైలు శిక్షను అనుభవిస్తున్నట్లు వర్గాలు తెలిపాయి. ఏడవ నంబర్ జైలులో భారీ భద్రత మధ్య ప్రత్యేక సెల్‌లో మాలిక్‌ను ఉంచారు. 2017లో ఎన్‌ఐఎ నమోదు చేసిన కేసులో మాలిక్‌ను 2019లో పోలీసులు అరెస్టు చేశారు.
- Advertisement -