Monday, December 23, 2024

ఐఫోన్ 11, ఐఫోన్ 12పై భారీ తగ్గింపు

- Advertisement -
- Advertisement -

Huge discount on iPhone 11, iPhone 12

 

హైదరాబాద్ : ఇ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ 2022 నేటి (జూలై 23న) అర్థరాత్రి ప్రారంభం కానుంది. ఈసేల్‌లో ఐఫోన్ 12 రూ. 52,999 తగ్గింపు ధరకు విక్రయిస్తోంది. దీనికి సిటీ బ్యాంక్, కోటక్ బ్యాంక్ లేదా ఆర్‌బీఎల్ బ్యాంక్ కార్డ్‌లతో షాపింగ్ చేసినవారు అదనంగా.1,000 తగ్గింపును పొందవచ్చు. ఫలితంగా ఐఫోన్ 11 ధర 40 వేల దిగువకు చేరగా. ఐ ఫోన్ 12ను రూ. 51,999కే సొంతం చేసుకోవచ్చు.

ఐఫోన్ 11 64GB బ్లాక్ వేరియంట్‌ను రూ. 2,000 బ్యాంక్ తగ్గింపుతో రూ. 39,999 ధరకు పొందవచ్చు. మోటో జీ 60 కూడా తగ్గింపుతో లభిస్తుంది. బ్యాంకు ఆఫర్‌తో కలిసి మోటో జీ60 ధర రూ. 13,999కి లభ్యం. పోకో ఎం4 ప్రొ స్మార్ట్‌ఫోన్ భారీ తగ్గింపుతో లభిస్తుంది. బిగ్ సేవింగ్ డేస్ సేల్‌లో షావోమి, వివో, రెడ్‌మినోట్ ఫోన్లు కూడా డిస్కౌంట్ ధరల్లో అందిస్తోంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News