హైదరాబాద్: తెలంగాణ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా రాజకీయ ప్రముఖులతో పాటు వివిధ రంగాలకు చెందిన సెలబ్రిటీలు ఆయనకు బర్త్ డే విషెస్ చెబుతున్నారు. ఇక టాలీవుడ్ కు చెందిన పలువురు ప్రముఖులు కెటిఆర్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. మెగాస్టార్ చిరంజీవి, మహేశ్ బాబు, రామ్చరణ్, రామ్ గోపాల్ వర్మ, గోపిచంద్ మలినేని, శ్రీనువైట్ల, సోనూసూద్, హరీశ్ శంకర్, అనసూయ, బండ్ల గణేశ్ తదితరులు మంత్రికి విషెస్ చెప్పిన వారిలో ఉన్నారు. ఇక విదేశీ ప్రముఖులలో యూకే భారత డిప్యూటీ హై కమిషనర్ డాక్టర్ ఆండ్రూ ఫ్లేమింగ్, భారత్ లో ఆస్ట్రేలియా హై కమిషనర్ బార్రీ ఓ,ఫెర్రెల్ కూడా కేటీఆర్కు ట్విటర్ ద్వారా శుభాకాంక్షలు చెప్పారు. ఇందుకు ప్రతిస్పందనగా కెటిఆర్ కూడా ప్రతి ఒక్కరికీ పేరు పేరునా ధన్యవాదాలు చెప్పుకొచ్చారు.
Many thanks Sir 🙏 https://t.co/2Nrx8TUn2g
— KTR (@KTRTRS) July 24, 2022
Happy Birthday to my dearest brother and most hardworking leader @KTRTRS
— Ram Charan (@AlwaysRamCharan) July 24, 2022
Wishing @KTRTRS a happy birthday, speedy recovery & a year ahead in which Telangana will will build upon the doors opened during his excellent first official visit to the 🇬🇧
Best wishes from all the @UKinHyderabad team. pic.twitter.com/UzEsJFazB0
— Dr Andrew Fleming 🇬🇧 🏴 (@Andrew007Uk) July 24, 2022