Friday, November 22, 2024

సబ్సిడీపై లక్ష బైక్‌లు

- Advertisement -
- Advertisement -

భవన నిర్మాణ కార్మికులకు తొలి విడతలో అందజేత

త్వరలో సిద్దిపేటలో న్యాక్ భవనం కార్మికుల సంక్షేమానికి ముఖ్యమంత్రి కెసిఆర్ పెద్దపీట : మంత్రి హరీశ్‌రావు

మన తెలంగాణ/సిద్దిపేట ప్రతినిధి: భవన నిర్మాణ కార్మికులకు సబ్సిడీపై మోటర్ సైకిళ్లు ఇవ్వనున్నట్టు రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు వెల్లడించారు. కార్మికుల సంక్షేమం కోసం సిఎం కెసిఆర్ ఎప్పుడూ ముందుంటార ని, దానిలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నారని మంత్రి తెలిపారు. మొదటి విడతగా త్వరలో లక్ష వాహనాలను కార్మికులకు అందివ్వనున్నామన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని కొండా భూ దేవి గార్డెన్‌లో జరిగిన భవన నిర్మాణ కార్మికుల సదస్సులో మంత్రి ముఖ్య పాల్గొన్నారు. సిఎం కెసిఆర్ కార్మికుల సంక్షేమానికి పెద్దపీట వే యడంతోనే కార్మికుల్లోనే భరోసా కలిగిందన్నారు. నిర్మాణ రంగంలో పనిచేసే కార్మికుల కోసం టిఆర్‌ఎస్ సర్కా ర్ ప్రత్యేక బడ్జెట్‌ను కేటాయించిందన్నారు. భవన నిర్మాణ కార్మికులు యావత్తు దేశానికే అభివృద్ధి పునాదిరాళ్లు అని కొనియాడారు. ఇంజినీర్ల కు సైతం తెలియని పనులు మీ అనుభవంతో సైనికుడి తరహాలో పనిచేసే తత్వం మీకు ఉంటుందన్నారు.

ఉమ్మ డి రాష్ట్రంలో కంటే స్వరాష్ట్రంలోనే కా ర్మికులకు మేలు జరుగుతుందన్నారు. కార్మికుల కోరిక మేరకు సిద్దిపేటలో నేషనల్ ఆకాడమీ ఆఫ్ కన్‌స్ట్రక్షన్ (న్యాక్) కోసం శాశ్వత భవనం నిర్మాణం చేస్తామని మంత్రి తెలిపారు. అదేవిధంగా భవన నిర్మాణ కార్మికుల కోసం ఎంఎల్‌ఎ నిధులు రూ.30 లక్షలు వెచ్చించి శాశ్వత భవనాన్ని నిర్మించనున్నట్టు తెలిపారు. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు తరఫున వివాహ బహుమతి ఉమ్మడి రాష్ట్రంలో ఐదు వేలు ఉంటే ప్రత్యేక తెలంగాణలో రూ.30వేలు అందిస్తున్నామన్నారు. కార్మికుడు మరణిస్తే అతని కుటుంబానికి అప్పటి ప్రభుత్వాలు రూ.35వేలు ఇస్తే, తెలంగాణ ప్రభుత్వంలో రూ.లక్షా 30వేల అందిస్తున్నామన్నారు. భవన నిర్మాణ కార్మిక బోర్డులో సభ్యునిగా చేరిన కార్మికులు వైకల్యం పొందితే ఐదు లక్షలు ప్రభుత్వం పరంగా ఇస్తున్నామని తెలిపారు. మూడు నెలల్లో అత్యుత్తమ అంతర్జాతీయ ఎల్‌అండ్‌టి కనస్ట్రక్షన్ కంపెనీ ద్వారా కార్మిక శిబిరాన్ని ఏర్పాటు చేయబోతున్నామన్నారు. న్యాక్ ద్వారా సిద్దిపేట జిల్లా కేంద్రంలో శిక్షణ పొందుతున్న ఐదు వేల మంది కార్మికులకు రోజు రూ.300 స్టైప్రండ్ ఇచ్చామని గుర్తు చేశారు. ఈ సదస్సులో ప్రజాప్రతినిదులు నాయకులు, భవన నిర్మాణ సంఘం నాయకులు కడవేర్గు రాజనర్సు, మచ్చ వేణుగోపాల్‌రెడ్డి, దరిపల్లి చంద్రం, శ్రీనివాస్, నర్సింలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News