Saturday, November 23, 2024

ఐటి రిటర్న్‌ను ఇలా ఫైల్ చేయాలి….

- Advertisement -
- Advertisement -

Return file is mandatory if TDS and TCS exceed Rs. 25,000

ముందుగా ఆదాయపు పన్ను శాఖ అధికారిక సైట్ https://eportal.incom etax.gov.in/iec/foservices/#/login కి వెళ్లాలి.
కస్టమర్ ఐడిని నమోదు చేసి, క్లిక్ చేయాలి. మీ పాస్‌వర్డ్‌ని నమోదు చేసి లాగిన్ కావాలి.లాగిన్ తర్వాత మీరు ఇ-ఫైల్‌పై క్లిక్ చేసిన పేజీ తెరవాలి. ఆ తర్వాత ఫైల్ ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్ ఆప్షన్‌ను ఎంచుకోవాలి.
2021-22 అసెస్‌మెంట్ ఇయర్ ను ఎంచుకుని, ఆపై కొనసాగించండి.
మీరు ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ ఎంపికలో మీరు ఆన్‌లైన్‌ని ఎంచుకుని, ’పర్సనల్’ ఎంపికను తీసుకోవాలి.
ఇప్పుడు ఐటిఆర్-1 లేదా ఐటిఆర్-4 ఎంపికను ఎంచుకుని కొనసాగించండి.
మీరు జీతం అందుకున్నట్లయితే ఐటిఆర్-1ని ఎంచుకొని, ఆ తర్వాత ఫామ్ డౌన్‌లోడ్ అవుతుంది. ఆ తర్వాత ’ఫిల్లింగ్ టైప్’కి వెళ్లి 139(1) ఒరిజినల్ రిటర్న్ ఎంపిక చేసుకోవాలి.
దీని తర్వాత ఎంచుకున్న ఫామ్ వస్తుం ది. మొత్తం సమాచారాన్ని పూరించండి, సేవ్ చేస్తూ ఉండాలి. బ్యాంకు ఖాతా వివరాలను సరిగ్గా పూరించాలి.
మీరు పైన ఆఫ్‌లైన్ మోడ్‌ని ఎంచుకుంటే, డౌన్‌లోడ్ ఫామ్‌లో మొత్తం సమాచారాన్ని పూరించిన తర్వాత, మీ ఫామ్‌ను ఎక్కడ అటాచ్ చేయాలనే ఆప్షన్ మీకు కనిపిస్తుంది.
ఫైల్‌ను అటాచ్ చేసిన తర్వాత సైట్ ఫైల్‌ని ధృవీకరిస్తుంది. ఈ విధంగా మీ రిటర్న్ ఫైల్ అవుతుంది. ఇప్పుడు మీరు మీ రిటర్న్‌ని ధృవీకరించడానికి ఇ- వెరిఫికేషన్ చేయవచ్చు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News