- Advertisement -
న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా కేంద్రీయ విద్యాలయాలలో 12 వేల అధ్యాపక పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇక నవోదయ స్కూళ్లలో 3 వేల టీచరు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ విషయాన్ని కేంద్ర విద్యా మంత్రిత్వశాఖ సోమవారం లోక్‌సభలో తెలిపింది. ఇక 9000 మంది టీచర్లను ఈ విద్యాలయాలలో కాంట్రాక్టు పద్ధతిపై తీసుకోవడం జరిగిందని వివరించారు. తమిళనాడులో 1162, మధ్యప్రదేశ్‌లో 1,066, కర్నాటకలో 1006 పోస్టులు భర్తీ చేయాల్సి ఉంది. 2001 నాటికి నవోదయ విద్యాలయాలలో ఖాళీల భర్తీ ప్రక్రియను కేంద్రం చేపట్టింది. అత్యధికంగా జార్ఖండ్‌లో 3156 పోస్టుల భర్తీ జరిగిందని కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి అన్నపూర్ణ దేవీ లోక్‌సభలో సమాధానంగా తెలిపారు.
- Advertisement -