- Advertisement -
అమరావతి: విశాఖపట్నంలోని ఆర్‌కె బీచ్‌లో వివాహిత గల్లంతుకావడంతో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. సాయి ప్రియ అనే వివాహిత కోసం రెండు కోస్ట్ గార్డ్ నౌకలు, ఓ హెలికాప్టర్‌తో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. సాయి ప్రియ గల్లంతుపై పలు అనుమానాలు ఉన్నాయి. ఆమె గల్లంతైనప్పుడు భర్త మాత్రమే ఉన్నాడు. సాయి ప్రియను సముద్రంలోకి ఎవరైనా తోసేశారా?, చుట్టూ అంత మంది మనుషులుంటే ఎలా మిస్ అవుతుంది, ఆమె భర్త చెప్పిన దాంట్లో నిజమెంత?, కనురెప్ప వాల్చే లోపే మనిషి ఎలా మిస్ అవుతుందనే అనుమానాలు ఉన్నాయి.
- Advertisement -