- Advertisement -
ముంబై: తాను గత ఏడాది ఆసుపత్రిలో ఉన్నప్పుడే తనను అధికారం నుంచి దించేయడానికి, మహా వికాస్ అగడి ప్రభుత్వాన్ని కూలదోయడానికి కుట్ర జరిగిందని శివసేన నాయకుడు ఉద్ధవ్ థాక్రే తెలిపారు. తాను శివసేన కార్యకర్తలపై, నాయకులపై పూర్తి విశ్వాసాన్ని ఉంచి నమ్మక ద్రోహానికి గురయ్యానని చెప్పారు. 2021 నవంబర్ లో ఆయన వెన్నెముక సర్జరీ చేయించుకున్నారు. అప్పుడే రెబల్స్ ఆయనపై కుట్ర మొదలెట్టినట్లు ఆయన చెప్పారు. మహారాష్ట్ర ప్రస్తుత ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే, దేవేంద్ర ఫడ్నవీస్ తనను కూలదోయడానికి చేయాల్సిందంతా చేశారన్నారు. ‘‘నాకేమి సానుభూతి అవసరం లేదు. కానీ నేను వాస్తవమేమిటో చెబుతున్నాను’’ అని ఆయన చెప్పుకొచ్చారు. ఆయన సంజయ్ రౌత్ కు ఇచ్చిన ఇంటర్యూలో ఈ వివరాలు తెలిపారు. ఆ ఇంటర్యూ మరాఠీ పత్రిక ‘సామ్నా’లో, హిందీ పత్రిక ‘దోపహర్ కా సామ్నా’లో వెలువడింది.
- Advertisement -