Tuesday, January 21, 2025

తెలంగాణ రాష్ట్రంలో క్రీడా రంగానికి పెద్దపీట: సత్యవతి రాథోడ్

- Advertisement -
- Advertisement -

TS Govt encouraging sports:Satyavathi rathod

మన తెలంగాణ / హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కెసిఆర్ రాష్ట్రంలో క్రీడా రంగానికి పెద్ద పీట వేశారని మహిళా శిశు సంక్షేమం, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. అంతర్జాతీయ స్థాయిలో రాణించేలా క్రీడాకారులను, కోచ్‌లను రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని అన్నారు. మంత్రి బంజారాహిల్స్‌లోని తన క్యాంపు కార్యాలయంలో మంగళవారం క్రీడాకారిణి మడావి కరీనాను అభినందించారు. ఈ నెల 30 నుండి ఆగష్టు 10వ తేదీ వరకు నార్త్ మెసిడోనియాలోని స్కోప్జేలో జరిగే ఐహెచ్‌ఎఫ్ మహిళల యూత్ వరల్డ్ ఛాంపియన్ షిప్‌లో భారతీయ యూత్ ఉమెన్ హ్యాండ్‌బాల్ టీమ్‌లో ప్లేయర్‌గా మడావి కరీనా ఎంపికైంది.

ఇందుకు గాను ఆమెను మంత్రి అభినందించారు. ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలం, చిచ్చుపల్లి గ్రామానికి చెందిన మడావి కరీనా ఆసిఫాబాద్ జిల్లాలోని తెలంగాణ గిరిజన రెసిడెన్షియల్ స్కూల్, జూనియర్ కాలేజీలో సిఇసి సెంకండియర్ చదువుతోంది. ఆసిఫాబాద్ జిల్లాలోని మారుమూల గ్రామంలో జన్మించిన కరీనా అంతర్జాతీయ స్థాయి ఆటలకు ఎంపిక కావడం చాలా సంతోషకరమన్నారు. ఆమెకు ప్రభుత్వం తరఫున అన్ని విధాల అండగా ఉంటామని మంత్రి హామినిచ్చారు. ఈ కార్యక్రమంలో టిడబ్లూ రీజినల్ కో ఆర్డినేటర్ గంగాధర్, హ్యాండ్ బాల్ అసోసియేషన్ సెక్రటరి రమేష్, ప్రిన్సిపల్ రమ్య, కోచ్ అరవింద్, హ్యాండ్‌బాల్ అసోసియేషన్ కన్వీనర్ కె. రాకేష్, డైరెక్టర్ లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News