Saturday, December 21, 2024

దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తున్న కేంద్రం.. రాష్ట్రపతికి లేఖ

- Advertisement -
- Advertisement -

Opposition letter to President Murmu over agencies misuse by Center

న్యూఢిల్లీ: ప్రతిపక్షాలను వేధించడానికి ప్రభుత్వం కేంద్ర దర్యాప్తు సంస్థలను దుర్వినియోగపరుస్తోందని, వెంటనే జోక్యం చేసుకోవాలని కోరుతూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు వివిధ ప్రతిపక్షాల నాయకులు మంగళవారం లేఖ రాశారు. ధరల పెరుగుదల, జిఎస్‌టి పెంపుపై చర్చించేందుకు అంగీకరించకుండా ప్రభుత్వం అనుసరిస్తున్న మొండి వైఖరిపై కూడా వారు రాష్ట్రపతికి రాసిన లేఖలో ఫిర్యాదు చేశారు. ప్రస్తుత వర్షాకాల పార్లమెంట్ సమావేశాల నిర్వహణకు ప్రభుత్వ వైఖరే అవరోధంగా మారిందని వారు తెలిపారు. తన రాజకీయ ప్రత్యర్థులపై కక్షసాధింపుతో వ్యవహరిస్తున్న మోడీ ప్రభుత్వం ఇందులో భాగంగా కేంద్ర దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తోందని వారు తమ లేఖలో తెలిపారు. చట్టం అందరికీ సమానమేనని, దీన్ని ఎటువంటి భయం లేదా పక్షపాతం లేకుండా అమలుచేయాల్సి ఉంటుందని లేఖలో వారు పేర్కొన్నారు. అయితే..ప్రస్తుతం అలా జరగడం లేదని, ప్రతిపక్షాలకు చెందిన కొందరు ప్రముఖ నాయకులపై ఏకపక్షంగా, అకారణంగా, ఎంపిక చేసుకుని మరీ కక్షసాధింపు చర్యలకు మోడీ ప్రభుత్వం పాల్పడుతోందని వారు ఆ లేఖలో ఆరోపించారు. ఈ లేఖపై కాంగ్రెస్, ఆప్, ఆర్‌జెడి, సిపిఎం తదితర పార్టీల నేతలు సంతకం చేశారు.

Opposition letter to President Murmu over agencies misuse by Center

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News