Monday, December 23, 2024

పంజాబ్ ఎజి అన్మోల్ రతన్ సిధూ రాజీనామా

- Advertisement -
- Advertisement -

చండీగఢ్: వ్యక్తిగత కారణాలతో తాను పంజాబ్ అడ్వకేట్ జనరల్ పదవికి రాజీనామా చేసినట్లు సీనియర్ న్యాయవాది అన్మోల్ రతన్ సిధూ మంగళవారం తెలిపారు. పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్‌కు జులై 10న తన రాజీనామా లేఖ సమర్పించినట్లు సిధూ తెలిపారు. నూతన అడ్వకేట్ జనరల్‌గా సీనియర్ న్యాయవాది వినోద్ ఘై నియమితులు కానున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది మార్చిలో సిధూ అడ్వకేట్ జనరల్‌గా నియమితులు అయ్యారు. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత దీపీందర్ సింగ్ పట్వాలియా రాజీనామా చేయడంతో ఆ పదవి ఖాళీగా ఉంది.

Advocate Anmol Rattan Sidhu Resign

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News