Monday, December 23, 2024

నేచర్ క్యూర్ ఆసుపత్రి అభివృద్ధికి చర్యలు: హరీష్ రావు

- Advertisement -
- Advertisement -

నేచర్ క్యూర్ ఆసుపత్రి అభివృద్ధికి చర్యలు
అన్ని రకాల సౌకర్యాలు, వసతులు కల్పించాలి
రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు ఆదేశాలు
మనతెలంగాణ/హైదరాబాద్: ప్రజలలో నేచురోపతి (ప్రకృతి) వైద్యంపై పెరుగుతున్న ఆసక్తికి అనుగుణంగా నేచర్ క్యూర్ ఆసుపత్రిని అభివృద్ధి చేసుకోవాలని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి టి.హరీశ్‌రావు తెలిపారు. అందుకు కావాల్సిన సదుపాయాలు వసతులు కల్పించాలని అధికారులను ఆదేశించారు. ప్రకృతి వైద్యంలో ప్రసిద్ధి పొందిన మంథని సత్యనారాయణ సలహాలు, సూచనలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. నేచర్ క్యూర్ విభాగం నుండి ప్రత్యేక బృందం విజయవాడలోని మంథని సత్యనారాయణ నేచురోపతి ఆసుపత్రిని సందర్శించాలని, అక్కడ అందుతున్న సేవలు, డైట్, ఇతర సదుపాయాల గురించి పూర్తిగా అధ్యయనం చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు.గాంధీ నేచర్ క్యూర్ ఆస్పత్రి సేవలపై మంగళవారం మంత్రి హరీశ్‌రావు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, నేచర్ క్యూర్ ఆసుపత్రిలో నాచురోపతి ఒపి, ఐపి సేవలకు మరింత మెరుగుపరచి అందుకు అనుగుణంగా ప్రత్యేక విభాగాలను ఏర్పాటు చేయాలని కోరారు.

ప్రకృతి వైద్యం కాబట్టి ఆస్పత్రిలో మంచి ఆహ్లాదకరమైన వాతావరణ ఉండేలా పచ్చదనాన్ని పెంచాలని సూచించారు. అదేవిధంగా నేచురోపతికి ప్రత్యేక బోజన డైట్ ఉంటుంది కాబట్టి వాటికి కావాల్సిన వంట గది, వంట గది సామగ్రి సమకూర్చాలన్నారు. వచ్చే రోగులకు సేవలు అందించేందుకు సరిపడా వైద్యులను సిబ్బందిని పెంచుకోవాలని మంత్రి అధికారులను ఆదేశించారు.
దేశంలో ఎంతో ప్రాముఖ్యత పొందిన గాంధీ నేచర్ క్యూర్ ఆస్పత్రిని మరింత అభివృద్ధి చేసి ప్రజలకు మెరుగైన ప్రకృతి వైద్యం అందించేందుకు అన్ని చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. వైద్యులు, అధికారులు మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేయాలని మంత్రి తెలిపారు. ఈ సమీక్షలో వైద్యారోగ్య శాఖ సెక్రెటరీ రిజ్వి, ఆయుష్ కమిషనర్ ప్రశాంతి, టిఎస్‌ఎంఎస్‌ఐడిసి ఎండీ చంద్రశేఖర్, సిఎం ఒఎస్‌డి దేశపతి శ్రీనివాస్, ప్రకృతి వైద్య నిపుణులు మంథని సత్యనారాయణ పాల్గొన్నారు.

Harish Rao Review on Nature Cure Hospital

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News