ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో నెలకొన్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ఆగస్టు 1వ తేదీ నుంచి షూటింగ్‌లను బంద్ చేయాలని ప్రొడ్యూసర్స్ గిల్డ్ నిర్ణయించింది. అయితే ఈ షూటింగ్‌ల బంద్‌తో తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్, ప్రొడ్యూసర్స్ కౌన్సిల్‌కు ఎలాంటి సంబంధం లేదని తెలిసింది. మంగళవారం హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోలో ప్రొడ్యూసర్స్ గిల్డ్‌లోని ప్రముఖ నిర్మాతల ప్రత్యేక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో చిత్ర పరిశ్రమలోని పలు సమస్యలపై చర్చించారు. నిర్మాణ వ్యయం, ఓటీటీలో సినిమాల విడుదల తదితర అంశాలపై నిర్మాతలు మాట్లాడుకున్నారు. ఈ సమావేశంలో ఆగస్టు 1 నుంచి సినిమా షూటింగ్‌లను నిలిపివేయాలని ప్రొడ్యూసర్స్ గిల్డ్ నిర్మాతలు నిర్ణయం తీసుకున్నారు. షూటింగ్‌లు ఆపేసి సమస్యలపై చర్చించాలని నిర్మాతలంతా తీర్మానించారు. ఇక ఆగస్టు 1 నుంచి షూటింగ్‌లు బంద్ చేయనుండడంతో చిరంజీవి చేస్తున్న మూడు సినిమాలు, పవన్‌కళ్యాణ్ ‘హరిహర వీరమల్లు’, బాలకృష్ణ 107వ సినిమా, ప్రభాస్ ‘ప్రాజెక్ట్ కె’, రవితేజ ‘రావణాసుర’, రామ్‌చరణ్-శంకర్ మూవీ, విజయ్ దేవరకొండ ‘ఖుషి’, అఖిల్ ‘ఏజెంట్’, సమంత ‘యశోద’, విజయ్, వంశీపైడిపల్లిల ‘వారసుడు’ చిత్రాలు తాత్కాలికంగా నిలిచిపోనున్నాయి.
Telugu Movies Shooting to stop from August 1st