- Advertisement -
అమరావతి: కారును లారీ ఢీకొట్టడంతో ముగ్గురు మృతి చెందిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్నూలు జిల్లా కేంద్రంలో జరిగింది. కర్నూలు సమీపంలో రింగురోడ్డుపై లారీ అదుపు తప్పి కారు ఢీకొట్టడంతోనే ఈ ప్రమాదం జరిగింది. కారులో ఉన్న ముగ్గురు ఘటనా స్థలంలోనే చనిపోయారు. ఈ ప్రమాదంలో గాయపడిన ముగ్గురిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. వాహనాదారుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని క్రేన్ సహాయంతో వాహనాలను పక్కకు తొలగించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు వెల్లడించారు. మృతులు హైదరాబాద్ కు చెందిన శేఖర్, గణేశ్, రుద్రగా గుర్తించారు. అర్థరాత్రి దాటిన తరువాత రెండు గంటల నుంచి ఉదయం ఆరు గంటల వరకు ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయని పోలీసులు తెలిపారు. డ్రైవింగ్ చేస్తున్న సమయంలో కళ్లు మూతలు పడడంతోనే ప్రమాదాలు జరుగుతున్నాయి.
- Advertisement -