జోగులాంబ గద్వాల: పాఠశాలలో నీటి సంపు కోసం తీసిన గుంతలో పడిన ఇద్దరు చిన్నారులు ప్రాణాలతో బయటపడిన ఘటన జోగులాంబ గద్వాల జిల్లాలో మంగళవారం చోటు చేసుకుంది. మండల కేంద్రమైన రాజోలి న్యూప్లాట్స్ పాఠశాలలో 220 మందికి పైగా విద్యార్థులు చదువుతున్నారు. ‘మన ఊరు మన బడి’ పనుల్లో భాగంగా పాఠశాల భవనానికి ఆనుకుని నీటి సంపును నెల రోజుల క్రితం తవ్వారు. దాని నిర్మాణ పనులు ఇప్పటికీ చేపట్టలేదు. సోమవారం రాత్రి నుంచి కురిసిన వర్షంతో అయిదు అడుగుల లోతున్న సంపు నిండా నీరు చేరింది. మంగళవారం మధ్యాహ్న భోజన సమయంలో విద్యార్థులంతా బయటకు రావడంతో పాఠశాల ఎదురుగా ఉన్న ఇంట్లోని జస్వంత్, వేణు అనే ఇద్దరు చిన్నారులు బడి పిల్లలతో ఆడుకునేందుకువచ్చారు. ఆడుతూ.. ఆడుతూ.. వర్షపు నీరు నిండిన గుంతలో పడిపోయారు. నీటిలో తల్లడిల్లుతున్న పిల్లలను చూసి ఇతర విద్యార్థులు కేకలు వేశారు. గమనించిన వంట ఏజెన్సీ మహిళ పూజిత అందులోకి దూకి ఇద్దరు పిల్లలను ఒడ్డుకు చేర్చడంతో పెద్ద ప్రమాదం తప్పింది. పనులు అ సంపూర్తిగా వదిలేయడంతో ప్రమాదాలు చోటు చేసు వేణుకుంటున్నాయని విద్యార్థుల తల్లిదండ్రులు వాపోయారు. పిల్లలను కాపాడిన మహిళను అందరూ అభినందించారు.
పాఠశాల పక్కన గుంతలో పడిన చిన్నారులు… ప్రాణాలతో బయటికి
- Advertisement -
- Advertisement -
- Advertisement -