- Advertisement -
నల్లగొండ: ముఖ్య కార్యకర్తలతో ఎంఎల్‌ఎ రాజగోపాల్ రెడ్డి వరుసగా భేటీలు అవుతున్నారు. రాజగోపాల్ రెడ్డి తన అభిప్రాయాలను కార్యకర్తలకు తెలియజేశారు. సంస్థాన్ నారాయణపురం కార్యకర్తలతో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో భేటీ అయ్యారు. తన అభిప్రాయాలను కార్యకర్తలకు తెలియజేశారు. వారం రోజుల్లో సమాధానం చెప్పాలని కార్యకర్తలకు సూచించారు. బిజెపిలోకి తాను వెళ్తే ఉప ఎన్నిక వస్తుందని కాంగ్రెస్ ఎంఎల్‌ఎ రాజగోపాల్ రెడ్డి తెలిపారు. నియోజకవర్గం కూడా అభివృద్ధి చెందుతుందన్నారు. ఏడాదిన్నర పదవి పోయినా పర్వాలేదన్నారు. మూడున్నర ఏళ్లుగా ఎలాంటి అభివృద్ధి జరగలేదని, ఉప ఎన్నికల వస్తే నియోజక వర్గం అభివృద్ధి చెందుతుందన్నారు.
- Advertisement -