Monday, November 25, 2024

కుల సంఘ భవనాలు ఆత్మగౌరవానికి ప్రతీక

- Advertisement -
- Advertisement -

నంగునూరు మండలంలోని కుల సంఘ భవనాలకు ప్రొసీడింగ్ కాపీలు అందజేసిన మంత్రి హరీశ్ రావు

సిద్దిపేట: కుల సంఘ భవనాలు ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలుస్తాయని మంత్రి హరీశ్ రావు అన్నారు. జిల్లా కేంద్రమైన సిద్దిపేట క్యాంపు కార్యాలయంలో బుధవారం మధ్యాహ్నం నియోజకవర్గ పరిధిలోని నంగునూరు మండల పరిధిలోని 6 గ్రామాలలోని కుల సంఘ భవనాలకు మంత్రి హరీశ్ చేతుల మీదుగా ప్రొసీడింగ్ కాపీలు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కుల సంఘ ఆత్మ గౌరవ భవనాలకు టీఆర్ఎస్ ప్రభుత్వం పెద్దపీట వేసినట్లు మంత్రి పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కులవృత్తులకు పోత్రాహం అందిస్తూ అన్ని వర్గాలు ఆర్థికంగా ఎదిగే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్‌ ఎంతో కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. కుల సంఘాలలో నిరుపేదలకు సంఘ భవనాలు శుభకార్యాలతోపాటు వివిధ కార్యక్రమాలు నిర్వహించడానికి ఉపయోగపడుతాయని తెలిపారు. ప్రతి కుల సంఘాల సంక్షేమానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుని కమ్యూనిటీ హాల్‌లతో పాటు సంఘ భవనాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నదని చెప్పుకొచ్చారు.

ఈ మేరకు అక్కెన్నపల్లి గ్రామ యాదవ కమ్యూనిటీ హాల్ రూ.10 లక్షలు, ఖానాపూర్ గ్రామ పీర్ల కొట్టం రూ.7 లక్షలు, కొండంరాజ్ పల్లి యాదవ కమ్యూనిటీ హాల్ రూ.7 లక్షలు, అప్పలాయ చెరువు ముదిరాజ్ కమ్యూనిటీ హాల్ రూ.5 లక్షలు, అప్పలాయ చెరువు రెడ్డి సంఘం కమ్యూనిటీ హాల్ రూ.5 లక్షలు, గట్లమల్యాల గొర్రెల హాస్టల్ రూ.10 లక్షలు, తిమ్మాయిపల్లి గ్రామ రెడ్డి సంఘం రూ.5 లక్షలు చొప్పున మొత్తం రూ.54 లక్షలు రూపాయల నిధుల కుల సంఘ భవనాల ప్రొసీడింగ్ కాపీలను ఆయా సంఘ ప్రతినిధులకు అందజేసినట్లు పేర్కొన్నారు. సిద్ధిపేట నియోజక వర్గాన్ని అన్నీ రంగాలలో అభివృద్ధి చేయడానికి మంత్రి హరీశ్ అహర్నిశలు కృషి చేస్తున్నాడని, కుల సంఘ భవనిర్మాణాలకు చేస్తున్న సేవలు మరువలేవని మండల పలువురు ప్రజాప్రతినిధులు కొనియాడారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News