Monday, December 23, 2024

అత్యాచార నిందితుడి కాల్చివేత

- Advertisement -
- Advertisement -

Rape accused shot dead in Noida

నోయిడాలో రేప్ తరువాతి ఘటన

నోయిడా : ఢిల్లీ శివార్లలోని నోయిడాలో స్కూలుకు వెళ్లుతున్న 12 ఏండ్ల బాలికపై ఓ యువకుడు అత్యాచారం జరిపాడు. బుధవారం జరిగిన ఈ ఘటన వెంటనే పోలీసులు స్పందించి నిందితుడిని పట్టుకున్నారు. అయితే ఈ వ్యక్తి తమ నుంచి తప్పించుకుని పారిపోతుండగా కాల్పులు జరిపామని ఈ క్రమంలో ఈ వ్యక్తి తూటాల గాయాలతో మృతి చెందాడని పోలీసులు తెలిపారు. బాలిక స్కూల్‌కు వెళ్లుతూ ఉండగా నిందితుడు ఆమెకు మాయమాటలు చెప్పి , సెక్టార్ 32లోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకువెళ్లాడు. అక్కడ దారుణానికి పాల్పడినట్లు , ఆ తరువాత కస్టడీ నుంచి తప్పించుకుని పోతూ ఉండగా కాల్పుల్లో చనిపోయినట్లు నోయిడా అదనపు డిసిపి రణ్‌విజయ్ సింగ్ తెలిపారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News