Monday, December 23, 2024

14 ఏళ్ల బాలుడిని కిడ్నాప్ చేసిన 30 ఏళ్ల వివాహిత

- Advertisement -
- Advertisement -

30-year-old married woman kidnapped 14-year-old boy

బాలుడితో బాలానగర్‌లో సహజీవనం
నిందితురాలిపై పోక్సో,కిడ్నాప్ కేసులు నమోదు

మనతెలంగాణ/హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా గుడివాడలో 14 ఏళ్ల బాలుడిని కిడ్నాప్ చేసిన 30 ఏళ్ల మహిళను నగరంలోని బాలానగర్ పోలీసులు గుర్తించి ఎపి పోలీసులకు అప్పగించారు. బాలనగర్‌లో ఓ గదిలో బాలుడు, మహిళను అదుపులోకి తీసుకున్న పోలీసులు సదరు 14 ఏళ్ల బాలుడికి కౌన్సెలింగ్ ఇచ్చి కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈక్రమంలో ఈ కేసులో నిందితురాలు స్వప్నపై ఫోక్సో యాక్ట్, కిడ్నాప్ కేసుల కింద కేసు నమోదు చేశారు. ఎపిలో గుడివాడలో ఉండే స్వప్నకు నలుగురు పిల్లలు ఉన్నారని, ఎదురు ఇంట్లో ఉండే 14 ఏళ్ల బాలుడితో శారీరిక సంబంధం ఏర్పరచుకుందని గుడివాడ సిఐ దుర్గారావు తెలిపారు. బాలుడుతో శాశ్వతంగా కలిసి ఉండాలనే దురుద్దేశంతో మాయమాటలు చెప్పి అపహరించి హైదరాబాద్‌కు తీసుకొచ్చిందని పేర్కొన్నారు. సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి ఇరువురిని గుర్తించినట్లు సిఐ దుర్గారావు వెల్లడించారు. పోలీసుల కథనం మేరకు ఎపిలోని గుడివాడ పట్టణంలో నివాసముండే వివాహిత మహిళ స్వప్న (33) స్థానికంగా ఉండే చిన్నారులతో నిత్యం సెల్‌ఫోన్‌లో హౌసీ గేమ్ ఆడుతూ వారిని ఆకర్షిస్తూ ఉండేది.

ఈ క్రమంలో ఆమె ఎదురింట్లో నివాసముండే బాలుడు (14) వివాహిత పట్ల ఆకర్షితుడయ్యాడు. వీరి మధ్య చనువు పెరగడంతో బాలుడిని ఆమె శారీరకంగా లోబర్చుకుంది. స్థానిక ఇంగ్లీష్ మీడియం స్కూల్లో 8వ తరగతి చదువుతున్న బాలుడు వివాహిత కారణంగా సరిగా పాఠశాలకు కూడా వెళ్లే వాడు కాదు. ఆమె ఇంటికి బాలుడు తరచూ వెళ్లడాన్ని గమనించి బాలుడి తల్లిదండ్రులు పలుమార్లు మందలించారు. ఈ విషయం బాలుడు ఆమెతో చెప్పాడు. దీంతో బాలుడు తనకు దూరమవుతాడని భావించిన మహిళ అతనికి మాయమాటలు చెప్పి ఈనెల 19న బలవంతంగా హైదరాబాద్ తీసుకెళ్లింది. వివాహితకు ప్రస్తుతం నలుగురు సంతానం ఉండగా భర్త పిల్లలను వదిలేసి బాలుడిని తీసుకొని వెళ్లి పోయింది. హైదరాబాద్ బాలానగర్ లో ఓ ఇల్లు అద్దెకు తీసుకుని బాలుడితో సహజీవనం చేస్తోంది.

కాగా గుడివాడ గుడ్‌మెన్ పేటలో ఎదురెదురు ఇళ్లలో నివాసముంటున్న స్వప్న అనే మహిళ, బాలుడు గత 19వ తేదీ నుంచి కనిపించకపోవడంతో బాలుడి కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. ’ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన పోలీసులు ప్రాథమిక విచారణలో మాయమాటలతో స్వప్న బాలుడిని అపహరించినట్లు గుర్తించారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి స్వప్న, ఆ బాలుడు హైదరాబాద్ బాలానగర్‌లో ఉన్నట్లు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. బాలుడికి కౌన్సిలింగ్ ఇచ్చి కుటుంబ సభ్యులకు అప్పగించగా నిందితురాలు స్వప్నపై పోక్సో చట్టం, కిడ్నాప్ కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News