- Advertisement -
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో రోజువారీ కొవిడ్ కేసులు పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 36,764 మందికి కొవిడ్ నిర్థారణ పరీక్షలు నిర్వహించగా కొత్తగా 852 కేసులు నమోదయ్యాయి. కరోనా బారి నుంచి తాజాగా 640 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 4,915 యాక్టివ్ కేసులు ఉన్నాయని వైద్యారోగ్యశాఖ బులిటెన్ విడుదల చేసింది. హైదరాబాద్‌లో అత్యధికంగా 358 కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో 57, మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాలో 63 కేసులు నమోదయ్యాయి.
Telangana Reports 852 new corona cases in 24 hrs
- Advertisement -