మన తెలంగాణ/కార్వాన్ : వరద నీటిలో కొట్టుకుపోతున్న వ్యక్తిని పోలీసులు కా పాడి ఉస్మానియా ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించా రు. పురానాపూల్ నుంచి జియాగూడకు వెళ్లే వంద అడుగుల రోడ్డులోని మూసీ నదిలో బుధవారం ఉదయం ఒక వ్యక్తి కొట్టుకుపోవడం గమనించిన స్థానికులు పురానాపూల్ వంతెన వద్ద విధి నిర్వహణలో ఉన్న హబీబ్‌నగర్ ఇన్‌స్పెక్టర్ సైదాబాబు, మంగళ్‌హాట్ పోలీస్‌స్టేషన్ ఎస్‌ఐ రాంబాబులకు సమాచారం అందించారు. వెంటనే ఇన్‌స్పెక్టర్, ఎస్‌ఐలుస్థానికుల సహాయంతో నీటిలో మునిగిపోతున్న వ్యక్తిని కాపాడారు. ఆ వ్యక్తిని ఎస్‌ఐ రాంబాబు భుజంపై మోసుకెళ్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. కాపాడిన వ్యక్తిని చికిత్స నిమిత్తం అతన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ధైర్య సాహసాలతో వ్యక్తిని కాపాడిన ఇన్‌స్పెక్టర్, ఎస్‌ఐలను పోలీసు ఉన్నతాధికారులు అభినందించి, రివార్డు ప్రకటించారు.
@hydcitypolice great efforts by cops
🙏#hyderabadrains pic.twitter.com/bC1NIqK4si— Pranitha (@pranithayadav91) July 27, 2022