Saturday, November 23, 2024

జికె, కరెంట్ అఫైర్స్

- Advertisement -
- Advertisement -

Job aspirants in Preparation

అంతర్జాతీయం:

రష్యా ప్రత్యేక ఐఎస్‌ఎస్!

అమెరికా, యూరప్, జపాన్, కెనడా, రష్యా సంయుక్తంగా నిర్మించిన అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్)నుంచి రష్యా వైదొలగనుంది.
ఉక్రెయిన్‌తో యుద్ధం నేపథ్యంలో అమెరికా సహా పశ్చిమ దేశాలతో అసఖ్యతతో రష్యా ఈ నిర్ణయం తీసుకుంది.
2024 ఏడాది తర్వాత ఐఎస్‌ఎస్‌లో రష్యా భాగస్వామిగా ఉండబోదని రష్యా దేశ అంతరిక్ష పరిశోధన సంస్థ చీఫ్ యూరీ బొరిసోవ్ జులై 26న పేర్కొన్నారు. సొంతంగా అంతరిక్ష కేంద్రాన్ని నిర్మించుకుంటామని స్పష్టం చేశారు. ఐఎస్‌ఎస్‌లో రెండు భాగాలున్నాయి.
ఒకటి రష్యా ఆద్వర్యంలో పనిచేస్తుండగా మరొకటి అమెరికా, ఇతర దేశాల భాగస్వామ్యంలో నడుస్తోంది.
భూమికి దాదాపు 250 మైళ్ల ఎత్తులో భూమి చుట్టూ పరిభ్రమించే ఐఎస్‌ఎస్‌లో దాదాపు ఏడుగురు వ్యోమగాములు అంతరిక్ష పరిశోధనలు చేస్తుంటారు.
భారరహిత స్థితిలో నెలల తరబడి ఉంటూ అంతరిక్ష పరిశోధనల పరికరాలను పరీక్షిస్తూ ఉంటారు.
ఇంతకాలం రష్యా రాకెట్లలో వ్యోమగాములను ఐఎస్‌ఎస్‌కు తీసుకెళ్లినందుకు నాసా ఆదేశానికి భారీ చెల్లింపులు జరిపేది.
కొత్తగా ఎలాన్‌మస్క్‌కు చెందిన స్పేస్‌ఎక్స్ సంస్థ ఈ బాధ్యతలు తీసుకోవడంతో రష్యాకు ఆర్థికంగా దెబ్బతీసినట్లయింది.

జాతీయం:

భారత పార్లమెంట్ సెంట్రల్ హాల్‌లో రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారం చేశారు.
జులై 25న ముర్ముతో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌వీ రమణ ప్రమాణ స్వీకారం చేయించారు.
సంతాల్ ఆదివాసీ తెగకు చెందిన గిరిజన మహిళ ద్రౌపది ముర్ము భారత 15వ రాష్ట్రపతిగా ప్రమాణశ్వీకారం చేశారు.
దేశ తొలి గిరిజన రాష్ట్రపతిగా రికార్డు సృష్టించారు.
స్వాతంత్య్రానంతరం జన్మించిన తొలి రాష్ట్రపతిగా కూడా రికార్డుకెక్కారు.
రాష్ట్రపతి పదవి చేపట్టిన వారిలో అత్యంత పిన్నవయస్కురాలిగా నిలిచారు.
జులై 21న జరిగిన లెక్కింపులో మూడింట రెండొంతుల మెజారిటీతో యశ్వంత్ సిన్హాపై విజయం సాధించారు.
ప్రతిభా పాటిల్ తర్వాత ఈ పదవి చేపట్టిన రెండో మహిళ. 25వ తేదీన పదవీ బాధ్యతలు చేపట్టారు.

ద్రౌపది ముర్ము ప్రస్థానం
పుట్టినతేది: 20.06.1958
జన్మస్థలం: ఉపరబెడ గ్రామం, ఒడిశా
ఎడ్యుకేషన్ : రాజనీతి శాస్త్రంలో డిగ్రీ
1997: రాయ్‌రంగపూర్ కౌన్సిలర్‌గా ఎన్నిక
రాయ్‌రంగాపూర్ నియోజకవర్గం నుంచి రెండుసార్లు భాజపా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.
2000-04: ఒడిశాలో నవీన్ పట్నాయక్ ప్రభుత్వంలో మంత్రి.
2006-09: ఒడిశా భాజపా ఎస్‌టి మోరా అధ్యక్షురాలు
2007: ఒడిశా అసెంబ్లీలో ఉత్తమ ఎమ్మెల్యే (నీలకంఠ సన్మాన్) పురస్కారం.
2015-21: జార్ఖండ్ గవర్నర్
2022 జులై 21: భారత రాష్ట్రపతిగా ఎన్నిక.
ఇండియా ఇన్నోవేషన్ ఇండెక్స్-2021
నీతి అయోగ్ ప్రకటించిన ఇండియా ఇన్నోవేషన్ ఇండెక్స్ 2021 (భారత ఆవిష్కరణల సూచీ 2021) మూడో ఎడిషన్ ర్యాంకుల్లో దేశంలో కర్ణాటక తొలి స్థానంలో, తెలంగాణ రెండో స్థానంలో, హర్యానా మూడోస్థానంలో నిలిచాయి.
ఏడు అంశాల్లో 66 సూచికల ఆధారంగా రాష్ట్రాల పనితీరును ఇన్‌స్టిట్యూట్ ఫర్ కాంపిటేటివ్‌నెస్ (ఐఎఫ్‌సీ) సహకారంతో నీతి అయోగ్ అధ్యయనం చేసి .. గ్లోబల్ ఇండియన్ ఇండెక్స్ (జీఐఐ) స్కోర్‌ను కేటాయించింది.
నివేదికను నీతి అయోగ్ చైర్మన్ సుమన్ బెరీ జులై 21న ఆవిష్కరించారు.
అత్యధిక టీకాలు ఉత్పత్తి చేసే నగరంగా హైదరాబాద్!
తెలంగాణలో తమ టీకా ఉత్పత్తులు, పరిశోధన రంగాన్ని భారీగా విస్తరించాలని కోవిడ్ వ్యాధి నియంత్రణకు కోర్బివ్యాక్స్ టీకా తయారు చేసిన బయోలాజికల్ ఈ (బిఈ) సంస్థ నిర్ణయించింది.
ప్రస్తుతం జీనోమ్ వ్యాలీలోని టీకా ఉత్పత్తులను భారీ ఎత్తున పెంచేందుకు ఏకంగా రూ. 1800 కోట్లకుపైగా పెట్టుబడులు పెట్టనుంది.
దీంతో ప్రపంచంలోనే అత్యధికంగా టీకాలు ఉత్పత్తి చేసే నగరంగా హైదరాబాద్ ఘనత సాధించనుంది.
రూ. 1800 కోట్లకు పైగా పెట్టుబడితో కొత్తగా 2,518 మందికి ఉపాధి లభిస్తుందని బీఈ సంస్థ ప్రకటించింది.
ప్రస్తుతం జీనోమ్ వ్యాలిలో ప్రతీ ఏడాది 900 కోట్ల టీకాలు ఉత్పత్తి అవుతుంటే బీఈ తాజా విస్తరణతో 1400 కోట్ల టీకాల ఉత్పత్తి సామర్థానికి చేరుకుంటుందని తెలిపారు.
అప్పుల్లో అగ్రస్థానం..తమిళనాడు
జులై 25న లోక్‌సభలో బీజేపీ ఎంపీ కిషన్‌కుమార్ అడిగిన ప్రశ్నకు మంత్రి లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు.
2020 మార్చినాటికి తమిళనాడు రూ. 6,59,868 కోట్ల అప్పుతో తొలి స్థానంలో ఉండగా..యూపీ రూ. 6,53,307 కోట్లు, మహారాష్ట్ర రూ. 6,08,999 కోట్లతో వరుసగా రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయని పేర్కొన్నారు.
తెలంగాణ అప్పు రూ. 3,12,191 కోట్లు కాగా, ఏపీ అప్పు రూ. 3,98,903 కోట్లుగా ఉందని తెలిపారు. అయితే రాష్ట్రాల రుణాలను ఆమోదించేటప్పుడు కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ ఫైనాన్స్ కమిషన్ సిఫారసుల ద్వారా నిర్దేశించిన ఆర్థిక పరిమితులను అనుసరిస్తుందని మంత్రి తెలిపారు.

స్పోర్ట్స్:

33 పతకాలతో అగ్రస్థానంలో అమెరికా

ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ పోటీలకు తొలిసారి ఆతిథ్యమిచ్చిన అమెరికా ఈ సారి అదగొట్టింది.
జులై 25న ముగిసిన ఈ మెగా ఈవెంట్‌లో అమెరికా 13 స్వర్ణాలు, 9 రజతాలు, 11 కాంస్యాలతో కలిపి మొత్తం 33 పతకాలతో టాప్ ర్యాంక్‌లో నిలిచింది.
ఒకే చాంపియన్‌షిప్‌లో అత్యధిక పతకాలు నెగ్గిన జట్టుగా అమెరికా రికార్డు నెలకొల్పింది.
1987లో తూర్పు జర్మనీ అత్యధికంగా 31 పతకాలు సాధించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News