ఆదేశాలు జారీ చేసిన ట్రాఫిక్ జాయింట్ సిపి
హైదరాబాద్: ఈ నెల 29వ తేదీన భారత దేశ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పర్యాటన సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ హైదరాబాద్ ట్రాఫిక్ జాయింట్ పోలీస్ కమిషనర్ ఎవి రంగనాథ్ ఆదేశాలు జారీ చేశారు. ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు రవీంద్రభారతిలో శుక్రవారం సాయంత్రం నిర్వహించనున్న కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సాయంత్రం 5.25కు జూబ్లీహిల్స్ రోడ్డు నంబర్ 29లోని తన నివాసం నుంచి బయలుదేరి పెద్దమ్మ టెంపుల్, సాగర్ సొసైటీ, శ్రీనగర్ టీ జంక్షన్, ఎన్‌ఎఫ్‌సిఎల్, తాజ్‌కృష్ణ, అన్సారీ మంజిల్, ఆర్‌టిఓ ఆఫీస్, వివి స్టాట్యూ, షాదన్ కాలేజీ, నిరంకారీ జంక్షన్, ఓల్డ్ సైఫాబాద్ పిఎస్, హెచ్‌డిఎఫ్‌సి యూ టర్న్, రవీంద్రభారతి గేట్ నంబర్ 1 నుంచి లోపలికి వెళ్లనున్నారు. ఈ ప్రాంతాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. వాహనదారులు ఆంక్షలను దృష్టిలో పెట్టుకుని ప్రత్యామ్నాయమార్గాల్లో వెళ్లాలని కోరారు.