Monday, December 23, 2024

రద్దీగా మారిన వ్యాక్సిన్ కేంద్రాలు….

- Advertisement -
- Advertisement -

Overcrowded Corona vaccine centers

కరోనా టెస్టులు, బూస్టర్ డోసులతో కిక్కిరిసిన జనం
ఒకే దగ్గర గుంపులుగా చేరడంతో విజృంభిస్తున్న వైరస్
కొన్నిచోట్ల సిబ్బంది కొరతతో అదనపు గంటలు విధుల నిర్వహణ
ప్రైవేటు ల్యాబ్‌లకు వెళ్లితే ఇదే అదనుగా రెండింతలు వసూలు

హైదరాబాద్: నగరంలో ఇటీవల కురుస్తున్న వానలకు సీజనల్ వ్యాధులతో పాటు, కరోనా వైరస్ విజృంభణ చేయడంతో వైద్యశాఖ బూస్టర్ డోసు పంపిణీతో ఆరోగ్య కేంద్రాలు రద్దీగా మారాయి. ఒక పక్క కరోనా టెస్టులు, మరో వైపు వ్యాక్సిన్ వేయడం కష్టంగా మారిందని బస్తీదవఖానల, పట్టణ ప్రాథమిక వైద్య కేంద్రాల సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోజుకు 60 నుంచి 70మంది పరీక్షలు, 100మంది వరకు బూస్టర్ డోసు ఇస్తున్నట్లు చెబుతున్నారు. ఉదయం 9గంటల నుంచి సాయంత్రం 7గంటల వరకు వైద్య సిబ్బంది విధుల్లో ఉంటూ ప్రజలకు సేవలందిస్తున్నట్లు పేర్కొంటున్నారు. ప్రభుత్వం సెలవులు పెట్టవద్దని పేర్కొనడంతో వైరస్ తగ్గుముఖం పట్టేవరకు ప్రజలకు చికిత్స అందిస్తామని వెల్లడిస్తున్నారు. ఇప్పటివరకు బూస్టర్ డోసు హైదరాబాద్ జిల్లాలో 09 శాతం, రంగారెడ్డిలో 08 శాతం, మేడ్చల్ జిల్లాలో 08 శాతం మందికి వేసినట్లు వైద్యశాఖ గణాంకాలు వెల్లడిస్తున్నారు. గ్రేటర్ పరిధిలో 256 బస్తీదవఖానలు, 177 పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో బూస్టర్ వేస్తున్నట్లు చెప్పారు.

అదే విధంగా ఎఎన్‌ఎం, ఆశ వర్కర్లు బస్తీలు, కాలనీలో తిరుగుతూ ప్రజలకు వ్యాధులపై అవగాహన చేయడంతో పాటు బూస్టర్ తీసుకునేలా ప్రజలను సమీప కేంద్రాలకు పంపిస్తున్నారు. దీంతో ఆరోగ్య కేంద్రాల్లో సరిపడ సిబ్బంది లేక బారమంతా విధులు నిర్వహించే వారిపై పడుతుందని పేర్కొంటున్నారు. ఇంకా కొన్ని ఆరోగ్య కేంద్రాల్లో ఇద్దరు ముగ్గురు వైద్య సిబ్బందే ఉండటంతో ప్రజలు పరీక్షల కోసం గంటల తరబడి వేచిచూడాల్సి వస్తుందని, ప్రతి కేంద్రంలో ఐదారుగురు సిబ్బంది ఉంటే రోగుల సకాలంలో చికిత్స అందించే అవకాశముందని మెడికల్ అధికారులు పేర్కొంటున్నారు. ఆరోగ్య కేంద్రాలకు వచ్చే వారంతా ఒకే దగ్గర గుంపులుగా చేరడంతో స్వల్ప లక్షణాలున్న వారికి కూడా పాజిటివ్ వస్తుందని చెబుతున్నారు. కొంతమంది జ్వరం, జలుబు తీవ్రంగా ఉండటంతో సమీపంలోని ప్రైవేటు డయాగ్నస్టిక్ సెంటర్లకు వెళ్లితే రూ. 2500 తీసుకుని వైరస్ నిర్దారణ పరీక్షలు చేస్తున్నట్లు నగరవాసులు మండిపడుతున్నారు. వైద్యశాఖ అడ్డగోలుగా ఫీజులు వసూలు చేసే ల్యాబ్‌లను తనిఖీలు చేసి పేదలకు సేవలందే విధంగా చూడాలని కోరుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News