Monday, December 23, 2024

గంటసేపు రైలును ఆపిన పాము

- Advertisement -
- Advertisement -

Snake found in Train

 

తిరువనంతపురం: రైలు భోగీలో పాము కనిపించడంతో ఆ రైలును గంట సేపు ఆపిన సంఘటన కేరళ రాష్ట్రం కోజికోడ్ స్టేషన్‌లో జరిగింది.  రైల్వే అధికారులు తెలిపిన వివరాల ప్రకారం… తిరువనంతపురం-నిజాముద్దీన్ రైలులోని ఎస్5 భోగీలో పాము కనిపించడంతో ప్రయాణికులు ఆందోళన చెందారు. వెటనే ప్రయాణికులు టిటిఇకి సమాచారం ఇచ్చారు. టిటిఇ రైల్వే అధికారులు చెప్పడంతో రైలును కోజికోడ్ స్టేషన్‌లో నిలిపివేశారు. పాములు పట్టేవారితో గంట సేపు వెతకగా దాని ఆచూకీ లభించలేదు. పోన్‌లో దాని ఫోటోలు చూసి అది విషపూరితమైన కాదని భావించారు. అది రైలులో నుంచి బయటకు వెళ్లి ఉంటుందని అధికారులు నిర్థారణకు వచ్చారు. బోగీకి ఉన్న రంద్రాన్ని కూడా మూసివేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News