Monday, December 23, 2024

కెసిఆర్ కు సినారె రచనలంటే ఎంతో ఇష్టం: శ్రీనివాస్ గౌడ్

- Advertisement -
- Advertisement -

KCR like C Narayana Reddy poems

హైదరాబాద్: డాక్టర్ సి నారాయణ రెడ్డి తెలంగాణ గర్వించదగ్గ గొప్ప కవి అని మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రశంసించారు.  రాష్ట్ర అబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ హైదరాబాద్ లోని రవీంద్ర భారతి లో తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ప్రముఖ కవి, జ్ఞానపీఠ అవార్డు గ్రహీత డా. సి నారాయణ రెడ్డి జయంతి సందర్భంగా వారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడారు.  సిఎం కెసిఆర్ కు సినారె రచనలు అంటే ఎంతో ఇష్టం అన్నారు. వారి రచనలు సిఎం కెసిఆర్ ను ఎంతో ప్రభావితం చేశాయన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు స్వయంగా కవి, సాహితీ వేత్త అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత కెసిఆర్ ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహించారన్నారు. తెలంగాణకు చెందిన వైతాళికుల, కవుల, సాహితీ వేత్తల, సామజిక వేత్తల జయంతి, వర్ధంతి లను సిఎం కెసిఆర్ ఆదేశాల మేరకు అధికారికంగా నిర్వహిస్తున్నామన్నారు. డా. సినారె జ్ఞాపకార్ధం హైదరాబాద్ లోని బంజారాహిల్స్ లో ఎంతో విలువైన ప్రాంతంలో సినారె సాహిత్య సారస్వత సదనాన్ని నిర్మిస్తున్నామని మంత్రి ప్రకటించారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరి గౌరీశంకర్, కాళోజీ పురస్కార గ్రహీత కోట్ల వెంకటేశ్వర రెడ్డి, సాహితీ వేత్త కెపి అశోక్ కుమార్, రాష్ట్ర సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ, రాజేంద్రప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News