న్యూఢిల్లీ: అధికార పక్షం, విపక్షాల మధ్య రభస సృతి మించడంతో సోమవారం వరకు ఉభయ సభలు(లోక్ సభ, రాజ్యసభ) వాయిదా పడ్డాయి. మాన్సూన్ సమావేశాల 10వ రోజున ఇలా కార్యకలాపాలు జరగకుండా వాయిదా పడింది. పెరుగుతున్న ధరలపై చర్చ జరపాలని ప్రతిపక్షాలు పట్టుపట్టాయి.కానీ అధికార పక్షం వ్యతిరేకించింది. నిన్న పార్లమెంటులో సోనియా గాంధీని టార్గెట్ చేసిన తీరుకు ప్రభుత్వం క్షమాపణలు చెప్పక తప్పదు. ఈ వివాదానికి నేను కేంద్రంగా ఉన్నాను. కానీ సోనియా గాంధీపై బిజెపి దాడి చేస్తోంది అని కాంగ్రెస్ ఎంపీ అధీర్ రంజన్ చౌదరి అన్నారు.
తన వ్యాఖ్యలపై అధీర్ చౌదరి క్షమాపణలు చెప్పారు. ఆ తర్వాత కూడా సోనియా గాంధీ క్షమాపణలు చెప్పాలని బిజెపి డిమాండ్ చేస్తూ ఆమెకు వ్యతిరేకంగా నినాదాలు చేసింది. ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణం వంటి అంశాలపై చర్చించాల్సిన అవసరం లేదని ఉద్దేశపూర్వకంగానే ఇలా చేస్తున్నారని కాంగ్రెస్ ఎంపీ మల్లికార్జున్ ఖర్గే అన్నారు.