- Advertisement -
హైదరాబాద్: సైబరాబాద్ లో నకిలీ సర్టిఫికెట్ల ముఠా గుట్టురట్టు అయింది. ఈ కేసులో 14 మంది నిందితులను సైబరాబాద్ పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. పోలీసుల సోదాల్లో 18 యూనివర్సిటీలు, 13 రాష్ట్రాలకు చెందిన.. టెన్త్, ఇంటర్ బోర్డుల నకిలీ సర్టిఫికెట్లు బయటపడ్డాయి. వందకు పైగా నకిలీ సర్టిఫికెట్లను స్వాధీనం చేసుకున్నామని పోలీసులు వెల్లడించారు. విజయవాడకు చెందిన కోటా కిషోర్ కుమార్, ప.గోకు చెందిన వెంకట్రావు కీలక సూత్రధారిగా గుర్తించారు. ఒక్కో సర్టిఫికెట్ కు రూ.50 వేల నుంచి రూ.3లక్షల వరకు వసూలు చేసినట్లు సమాచారం. ఈ ముఠా ఉత్తరభారతదేశానికి చెందిన పలు వర్శిటీల సర్టిఫికెట్లను తయారు చేసినట్లు తెలింది. నకిలీ సర్టిఫికెట్లతో చాలా మంది విదేశాల్లో స్థిరపడ్డారని పోలీసులు తెలిపారు.
- Advertisement -