Monday, December 23, 2024

పిల్లలు, మహిళల సంరక్షణలో కలిసి పనిచేస్తాం

- Advertisement -
- Advertisement -

We work together in the care of children and women

హైదరాబాద్: పిల్లలు, మహిళల సంరక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేయనున్నామని నోబెల్ శాంతి బహుమతి గ్రహీత కైలాస్ సత్యార్థి స్థాపించిన బచన్ బచావో ఆందోళన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ధనంజయ్ టింగల్ పేర్కొన్నారు. ఈ మేరకు రాష్ట్ర బాలల రక్షణ సంఘం, మహిళ, శిశు సంక్షేమ శాఖ , పోలీసుశాఖకు చెందిన మహిళా భద్రతా విభాగం (డబ్ల్యూఎబ్ల్యూ)తో ఎంవోయూ కుదుర్చుకొన్నామని పేర్కొన్నారు. పరిశ్రమలలో, కార్ఖానాలలో బల వంతంగా పని చేస్తున్న, బందీలుగా ఉన్న బాల కార్మికులు, అక్రమ రవాణాకు గురైన పిల్లలు, మహిళల రక్షణ కార్యక్రమాలను సమర్థంగా అమలు చేయడం, వారిని రక్షించి తిరిగి సమా జంలో కలిసి పోయేలా చేయడం, పునరావాసం కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పని చేయనున్నట్టు తెలిపారు.

ముఖ్యంగా రాష్ట్రంలోని 12,500 గ్రామాలను ’బాలల స్నేహపూర్వక గ్రామాలు’గా మార్చడమే తమ లక్ష్యమని, ఈ నేపథ్యంలో మూడు సంవత్సరాల కార్యాచరణతో ముందుకు వెళ్తున్నామని వివరించారు. ఇందులో భాగంగా మహిళ, శిశు సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శి దివ్య దేవరాజన్, అడిషనల్ డిజిపి స్వాతిలక్రా, డిఐజి సుమతి, ఐసిపిఎస్ నోడల్ అధికారి శారద, స్పెషల్ ప్రొటెక్షన్ యూనిట్ అధికారి రాకేశ్‌తో బిబిఎ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ధనంజయ్ టింగల్, సీనియర్ అధికారులు ఎం చందనలు ఒప్పందం చేసుకుని ఎంవొయూలు మార్చుకొన్నారు. తొలుత రాష్ట్ర చైల్ ప్రొటెక్షన్ సొసైటీ, డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఉమెన్ డెవలప్‌మెంట్ చైల్ వెల్ఫేర్‌తో అవగాహనా ఒప్పందం చేసుకున్నామని, అలాగే రాష్ట్ర పోలీసు శాఖలోని మహిళా భద్రతా విభాగంతో ఒప్పందం చేసుకోవడం జరిగిందని బచన్ బచావో ఆందోళన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ధనంజయ్ టింగల్ వివరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News