- Advertisement -
హైదరాబాద్: అక్రమంగా తరలిస్తున్న విదేశీ సిగరేట్లను శంషాబాద్ ఎయిర్ పోర్టులో కస్టమ్స్ అధికారులు శనివారం పట్టుకున్నారు. సిగరేట్లను తరలిస్తున్న ఆరుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఎయిర్‌పోర్టుకు శుక్రవారం 6ఈ 1406 విమానంలో వచ్చిన ఆరుగురు ప్రయాణికులను అధికారులు తనిఖీ చేయగా వారి వద్ద 22,600 సిగరేట్లు, 940 ఈ సిగరేట్లు లభించాయి. కస్టమ్స్ సిబ్బంది స్వాధీనం చేసుకున్న సిగరేట్ల విలువ రూ.11.66లక్షలు ఉంటుంది. నిందితులను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు.
- Advertisement -