Monday, November 25, 2024

జూలై 31 దాటితే రూ.1000 ఫైన్

- Advertisement -
- Advertisement -

Penalty for filing ITR after 31st July

ఆదాయం రూ.5 లక్షలు దాటితే రూ.5 వేల జరిమానా
ఐటి రిటర్న్ గడువును పొడిగించేది లేదు : ఐటి శాఖ

న్యూఢిల్లీ : గడువు లోగా ఐటి రిటర్న్‌ను దాఖలు చేస్తే సమస్యలేదు, కానీ జూలై 31 దాటిన తర్వాత ఐటిఆర్ ఫైల్ చేస్తే జరిమానా తప్పదు. సోషల్ మీడియాలో ఐటిఆర్ గడువు పెంచాలని పెద్ద సంఖ్యలో కోరినప్పటికీ గడువును పొడిగించేది లేదని ఐటి శాఖ ఖరాఖండిగా చెప్పింది. జూలై 31 తేదీ దాటితే వార్షికంగా రూ.5 లక్షల లోపు ఆదాయం కల్గిన వారికి రూ.1000 జరిమానా, ఆదాయం రూ.5 లక్షలు దాటి వారికి రూ.5000 జరిమానా ఉంటుందని ఐటి శాఖ ప్రకటించింది. ఆదాయపు పన్ను రిటర్న్‌ను దాఖలు చేయడంలో సాంకేతిక సమస్యలు, పలు సందేహాలకు ఐటి డిపార్ట్‌మెంట్ సమాధానమిచ్చింది. మొబైల్ నంబర్‌లను ఆధార్‌తో లింక్ చేయని పన్ను చెల్లింపుదారులు ఇంటర్నెట్ బ్యాంకింగ్‌లోకి లాగిన్ కావడం ద్వారా డిజిటల్ సిగ్నేచర్ సర్టిఫికేట్‌ను ఉపయోగించి కొత్త పాస్‌వర్డ్‌ను నమోదు చేయవచ్చని డిపార్ట్‌మెంట్ తెలిపింది.

ఫైల్ చేసిన పన్ను చెల్లింపుదారులు వేచి ఉండాల్సి ఉంటుందని ఐటి శాఖ తెలిపింది. వివిధ బ్యాంకులు మూడు నాలుగు రోజుల్లో డిపార్ట్‌మెంట్‌కు సమాచారాన్ని పంపుతాయని ఆదాయపు పన్ను శాఖ తెలిపింది. ఇప్పటికే ఫైల్ చేసిన వారికి పన్ను రిటర్న్, వివరాలు వస్తాయి. ఐటిఆర్‌లో పన్ను చెల్లింపు సమాచారం స్వయంచాలకంగా ఉంటుందని, అయితే పన్ను చెల్లింపుదారులు కొంచెం వేచి ఉండాల్సి ఉంటుందని ఐటి పేర్కొంది.

పాస్‌వర్డ్ మార్చడంపై ఐటి సమాధానమిచ్చింది. వినియోగదారులు డిజిటల్ సంతకంతో పాస్‌వర్డ్‌ను మార్చవచ్చని డిపార్ట్‌మెంట్ తెలిపింది. వారు డైరెక్ట్‌గా ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా ఇ-ఫైలింగ్ ఖాతాకు లాగిన్ కావచ్చు. రిటర్న్‌లను దాఖలు కేటగిరీ వారీగా మారుతుంది. ఎఐఎస్, 26ఎఎస్‌లో ఆదాయంలో వ్యత్యాసం, బ్యాంక్ వడ్డీని ఆదా చేయడం కోసం మినహాయింపు, పన్ను విధానాన్ని మార్చడం ఉంటుంది. ఆఫ్‌లైన్‌లో రిటర్న్‌లను దాఖలు చేయడం మొదలైనవి ఉన్నాయి. పన్ను చెల్లింపుదారుల కేటగిరీ ఆధారంగా ఐటి రిటర్న్‌ను దాఖలు చేసే తేదీ మారుతుంది. జీతం పొందే వ్యక్తులు జూలై 31లోగా ఆదాయపు పన్ను రిటర్న్‌లను దాఖలు చేయాల్సి ఉంది. కార్పొరేట్లు, వ్యాపారవేత్తలు అక్టోబర్ 31లోగా రిటర్నులు దాఖలు చేయాల్సి ఉంటుంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News